'కరోనా' మహమ్మారి తెలుగు రాష్ట్రాలను విఅప్రీతంగా అల్లాడిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు రావడం, వాటి గురించి మనం చెప్పుకోవడం బాగా రొటీన్ వ్యవహారం అయిపోతోంది. సరే వీటి గురించి మాట్లాడుకోవడం మానేద్దామా అంటే... ఇది మనం తెలుసుకోవాల్సిన ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవలసిన విషయం అయిపోయే. ఏం చేస్తాం... తెలుసుకోక తప్పదుకానీ రోజు ఆంధ్ర హెల్ బులిటెన్ రోజూటి సమయానికి జిల్లా వారీగా కేసుల వివరాలను తెలుపకపోవడం గమనార్హం.

 

రోజు రోజుకు ఆంధ్ర రాష్ట్రంలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,136 మంది నమూనాలు పరీక్షించగా 47 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలను తొలి సారి బులిటెన్‌లో తెలియజేయలేదు.

 

దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,561కి చేరింది. వాటిలో ఆల్రెడీ 1778 మంది రికవరీ అయి, ఇళ్లకు వెళ్లిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఒకరు ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకూ 56 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చివరకు 717 మంది మాత్రం కరోనాతో తేల్చుకుంటామంటూ పోరాడుతున్నారు.

 

ఐతే... కొత్తగా నమోదైన 47 కేసుల్లో చిత్తూరులో 3, నెల్లూరులో 2 కేసులకూ... తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కూ సంబంధం ఉందని తేలింది. అంతే కాకుండా నెల్లూరు జిల్లా కావలిలో తాజాగా వెంగళరావు నగర్ లో ఒక కేసు నమోదు కాగా సదరు వ్యక్తి చెన్నై నుండి రెండు రోజుల క్రితమే కావలి పట్టణానికి తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 153 ఉన్నాయని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: