ప్రపచంలో కరోనా మహమ్మారి మొదలైన కొత్తలో వెంటే దీని ప్రభావం గమనించి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది.  అయితే భారతీయ సంస్కృతి అంటే మనం తినే ఆహార పదార్థాలు, కట్టుబాట్లు కరోనా ఎక్కువగా విస్తరించకుండా చేశాయి. అదే విధంగా లాక్ డౌన్ తో అందరూ ఇంటిపట్టునే ఉండటం కూడా ఈ కేసులు ఎక్కువగా పెరగకుండా కాపాడుకున్నాం.. అయితే ఇప్పుడు దేశంలో కేసులు పెరుగుతున్నాయి.. ఇదే సమయంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపులు వచ్చాయి.. మొన్నటి దాకా గూట్లో పక్షులు ఒక్కసారే రివ్వున ఎగరిపోయినట్టు జనాలు రోడ్లపైకి రావడం మొదలు పెట్టారు.  ఇదే అదనుగా కరోనా మరింత విజృంభించడం మొదలు పెట్టింది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా చతికిల పడుతున్నా లాక్‌డౌన్ పొడిగిస్తోంది కేంద్రం.

 

ఒక్కరోజులో ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌- 5లో నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత అత్యధికంగా భారత్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి.  ఇప్పుడు ఇదే ప్రజలను కలవరపెడుతున్న విషయం.. ప్రజలు భయపడిపోతున్న అంశం.  అంతే కాదు మహారాష్ట్ర, తమిళనాడు మరికొన్ని రాష్ట్రల్లో కేసులు పెరగడమే కాదు చావులు కూడా పెరిగిపోతున్నాయి.   మే నెల ప్రారంభంలో దేశంలో ఒకరోజు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య 2,400 దాటింది. మే మొదటి వారం తర్వాత ఆ సంఖ్య 3 వేలు దాటింది.  దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి చేరింది.

 

మృతుల సంఖ్య 3,720కి పెరిగింది. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మొదట్లో తక్కువగా నమోదు కావడానికి పరీక్షల సంఖ్య కూడా ఓ కారణం. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది.  ఏది ఏమైనా ఈ మహమ్మారి ప్రాణాలకు గండగంగా మారిందని బాధపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: