తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత విష‌యంలో బ్యాడ్ టౌం కొనసాగుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన క‌విత ఆ ఎన్నిక‌ల్లో గెలుపొందారు. అయితే,  2019 ఎన్నిక‌ల్లో కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలుగా దూరంగా ఉంటున్నారు. ఈ స‌మ‌యంలో కేసీఆర్ కీల‌క నిర్ణయం తీసుకొని క్రియాశీల రాజ‌కీయాల‌లో ఆమెకు రీ ఎంట్రీ ఇప్పించాల‌ని చూసిన‌ప్ప‌టికీ, ఆమెకు బ్యాడ్ టైం కొన‌సాగుతోంద‌ని అంటున్నారు.

 

 

2019 ఎన్నిక‌ల్లో ఎంపీ కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలుగా దూరంగా ఉంటున్నారు. అందుకే ఆమెకు నిజామాబాద్ స్థానిక సంస్థలఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా సీటు కేటాయించి.. మళ్లీ ఆమెను లైవ్‌లోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ అనుకొని ఆమె పేరు ఖ‌రారు చేశారు. మార్చి 18న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భాగంగా నామినేషన్లు వేశారు. అనంత‌రం కరోనా కారణంగా ఇప్పటికే ఒకసారి ఎన్నిక వాయిదా పడింది. 

 

 

తాజాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరోసారి వాయిదా పడింది. లాక్‌డౌన్ కారణంగా ఎన్నికను 45 రోజుల పాటు వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగస్ట్ మొదటి వారంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాగా, పొలిటిక‌ల్ లైఫ్‌లో మ‌ళ్లీ లైవ్ రీ ఎంట్రీ ఇవ్వాల‌నుకున్న క‌విత‌కు ఈ వాయిదాల రూపంలో బ్యాడ్ టైం కొన‌సాగుతోంద‌ని అంటున్నారు.కాగా, టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌‌లో చేరారనే కారణంతో నిజామాబాద్​ లోకల్ ​బాడీ ఎమ్మెల్సీ పోస్టు నుంచి రేకుల భూపతిరెడ్డి సస్పెండ్ అయ్యారు. దీంతో 2019 జనవరి 16 నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: