ఈతరం జనరేషన్ పిల్లలు ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎప్పుడు పోట్లాడుతారో తెలియదు. ఇంకొంత మంది ప్రేమించిన సమయంలో తొందరపడి శారీరకంగా కలుస్తారు. ఆ తర్వాత ప్రేమ బాగుండి అన్ని కరెక్ట్ గా ఉంటే పెళ్లి చేసుకుంటారు లేకపోతే మధ్యలోనే విడిపోతారు. ఆ తర్వాత అమ్మాయి తరపు వారు అబ్బాయి మోసం చేశాడని కేసు పెడతారు ఈ మధ్య ఇలాంటి కేసులు దేశంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి.

IHG

ఇక అసలు విషయానికి వస్తే... పెళ్లికి ముందు ప్రలోభాలకు గురి చేసి వివాహేతర సంబంధం పెట్టుకోవడం అత్యాచారం కాదని ఒడిస్సా హై కోర్ట్ తీర్పును వెల్లడించింది. కొందరు ప్రేమ ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లికి ముందే శారీరకంగా కలుస్తూ ఉంటారు. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చేసి విడిపోతారు. ఆ తర్వాత వారు మనస్పర్థలు వచ్చి విడివిడిగా కోర్టులో కేసులు పెట్టుకుంటారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఒడిస్సా రాష్ట్రంలో జరిగింది.

IHG

ఒడిస్సా రాష్ట్రం లోని కోరాపుట్ జిల్లా పొట్టంగి ఠాణా లో నమోదు అయ్యింది. ఈ కేసును విచారణ సందర్భంగా శనివారం నాడు హైకోర్టు జస్టిస్ ఎస్ కె ప్రాణి గ్రహి నేతృత్వంలో ధర్మాసనం ఇలా వివరణ ఇచ్చింది. పెళ్లికి ముందే కొందరు వ్యక్తులు శారీరకంగా కలుస్తున్నారు. యువకుడు పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం జరిగిందని యువతులు కేసులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలను అత్యాచారాలుగా పరిగణించ వద్దని హైకోర్టు ఈ అభిప్రాయాన్ని తెలిపింది. 2019 సంవత్సరంలో నమోదైన ఈ కేసును విచారించిన అనంతరం ఒరిస్సా హైకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: