కరోనా లాక్‌డౌన్‌తో రెండు నెలల క్రితం మూతపడిన శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌.. మళ్లీ తెరుచుకోబోతోంది. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో తిరిగి తన కార్యకలాపాలను యథావిధిగా ప్రారంభించబోతుంది. అయితే  ప్రయాణీకుల రక్షణకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ పలు జాగ్రత్తలు తీసుకుంది.  ప్రయాణీకులకు కొన్ని ఆంక్షలు కూడా విధించింది. 

 

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ విధించడంతో... మార్చి 25న శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మూతబడింది. దాదాపు రెండు నెలలుగా ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. అన్ని కార్యకలాపాలు ఆపివేశారు. రాకపోకలను పూర్తిగా నిషేధించారు. వందేభారత్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విమానాలు తప్ప.. ఇతర రాకపోకలు పూర్తిగా బంద్ య్యాయి. 

 

అయితే లాక్‌డౌన్‌లో సడలింపులిచ్చిన కేంద్రం ఈనెల 25 నుంచి దేశీయ విమానయానానికి అనుమతులిచ్చింది. కేంద్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు... మళ్లీ యాక్టివ్‌ కాబోతోంది. సోమవారం నుండి కార్యకలాపాలు పునఃప్రారంభించడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు అధికారులు. ప్రయాణీకుల రక్షణకే అధిక ప్రాధాన్యతను ఇస్తూ కాంటాక్ట్‌ లెస్‌ బోర్డింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రయాణీకులను ఎవరూ టచ్‌ చేయకుండానే.. సెక్యూరిటీ చెకప్‌ పూర్తి చేసేలా, నేరుగా విమానంలోకి  ఎక్కేలా చర్యలు తీసుకున్నారు.

 

స్కాన్‌ అండ్‌ అప్లై విధానం ద్వారా.. ప్రయాణీకులు నేరుగా సెల్ఫ్‌ చెకిన్‌  చేసుకునేలా, మొబైల్‌ నుంచే బోర్డింగ్‌ పాస్‌ పొందేలా ఎయిర్‌ పోర్టులో ఏర్పాట్లు చేశారు. సెల్ఫ్‌ బ్యాగ్‌ ట్యాగ్‌ సౌకర్యం కూడా కల్పించారు. ఇక ఎయిర్‌పోర్టులో  ప్రత్యేకంగా భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు జరిగాయి.  బ్యాగేజీ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌లోనూ అన్ని బ్యాగేజీలను, ప్యాసింజర్‌ ట్రాలీలను, హ్యాండ్‌ బ్యాగేజీ సెక్యూరిటీ స్క్రీనింగ్‌ ట్రేలను డిస్‌ ఇన్ఫెక్ట్‌ చేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించారు. బోర్డింగ్‌ పాస్‌ తీసుకున్న తరువాత ప్రయాణికుడి సెక్యూరిటీ చెక్‌ ఇన్‌ కోసం ప్రత్యేక స్కానర్లను ఏర్పాటు చేశారు. స్కానింగ్‌ పూర్తయ్యాక థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. ఇక, ప్రతి ప్రయాణీకుడి మొబైల్‌లో ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ ఉండాల్సిందేనంటున్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: