ఎంసెట్ సహా తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీలు ఖరారయ్యాయి.  జులైలో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. డిగ్రీ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహిస్తామనీ..  మొదటి ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉంటాయని ఉన్నత విద్యామండలి  తెలిపింది.  

 

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. జులై ఒకటి నుంచి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లు ప్రారంభం కానున్నాయి. ఒక్క  ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష తప్ప మిగతా పరీక్షల తేదీలను ప్రకటించింది ఉన్నత విద్యామండలి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర అధికారులు సమావేశమై  ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీల పై చర్చించారు. తేదీలను ఫైనల్ చేశారు.


 
ఎక్కువ మంది విద్యార్థులు రాసే ఎంసెట్ జులై 6 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు జరగనుంది. ఐ సెట్ జులై 13 న  పీజీ ఈసెట్ జులై ఒకటి నుంచి 3 వరకు... ఈసెట్ జులై నాలుగున జరగనుంది.  ఇక జులై 10 న  పీజీ లా సెట్ జరగనుండగా... ఎడ్సెట్ జులై 15 న నిర్వహించాలని నిర్ణయించారు. అదే విదంగా పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ ని జులై ఒకటి న నిర్వహించాలని నిర్ణయించారు. కరోనాను దృష్టి లో పెట్టుకొని అన్ని చర్యలు తీసుకుంటామని...వైద్య ఆరోగ్య సంస్థల సూచనల ను పరిగణనలోకి తీసుకొని పరిక్షలను నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

 

ఇక డిగ్రీ పరీక్షల విషయంలో మొదటి ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తామని, జూన్ 20 నుంచి పరీక్షలు ఉంటాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో ఇబ్బందులు ఉన్నతరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించింది. ఫైనల్ ఇయర్ రాసే విద్యార్థులకి బ్యాక్ లాగ్స్ ఉంటే ఫైనల్ ఇయర్ పరీక్షలు ముగిసిన వారం రోజుల తర్వాత నిర్వహిస్తామని ... విద్యార్థులు ఆందోళన చెందకుండా పరీక్ష లకు ప్రిపేర్ కావాలని విద్యామండలి విజ్ఞప్తి చేసింది.

 

ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నీ ఈ నెలలో జరగాల్సి ఉండగా... కోవిడ్ దెబ్బకు వాయిదా పడ్డాయి. ఎంసెట్ పరీక్షకు రెండు లక్షల 10 వేలకు పైగా విద్యార్థులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు... కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల దరఖాస్తు గడువును వచ్చే నెల 10 వరకు పొదగించింది ఉన్నత విద్యామండలి.

మరింత సమాచారం తెలుసుకోండి: