ప్రాజెక్టులపై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పడుతోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవన్నే కాంగ్రెస్ ఉద్యమ బాట వేసుకుంది.  కృష్ణా, గోదావరి  పెండింగ్ ప్రాజెక్టులపై  ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది.  

 

కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అయ్యింది. ప్రాజెక్ట్ బాట పట్టాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన ఉద్దేశం నెరవేరడం లేదని ఆరోపించింది. జూన్ 2 నుంచే కార్యాచరణ అమలు చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. జూన్ 2 న కృష్ణా నదిపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లపై దీక్ష లు చేయనుంది. SLBC టన్నెల్ దగ్గర..ఉత్తమ్.,జానా., కోమటిరెడ్డి లు దీక్ష చేయబోతున్నారు. ఖమ్మంలో పాలేరు దగ్గర భట్టి, పాలమూరు రంగారెడ్డి వద్ద చిన్నారెడ్డి,  నెట్టం పాడు వద్ద మాజీ ఎమ్మెల్యే సంపత్ , కల్వకుర్తి వద్ద వంశీ దీక్షలు చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి.

 

మరోవైపు జూన్‌ 6వ తేదీన గోదావరిపై పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద కూడా దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. తుమ్మిడి హట్టితో సహా అన్ని చోట్లా దీక్షలు చేయాలని  పార్టీ పిలుపునిచ్చింది.  ఈ దీక్షల ద్వారా సీఎం కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు నిజాలు తెలిసేలా చేస్తామన్నారు.

 

ఇక ప్రభుత్వం తెస్తున్న నూతన వ్యవసాయ విధానం పై రైతులతో సదస్సులు పెట్టాలని నిర్ణయించింది. జూన్ 3, 4 న రైతులతో నిర్బంధ వ్యవసాయంపై సంప్రదింపులు చేయబోతుంది. ఉస్మానియా భూముల వ్యవహారంపై కూడా ఆందోళనకు సిద్ధమవుతోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.  అటు ప్రైవేటు యూనివర్సిటీలనూ వ్యతిరేకించింది.


కోర్ కమిటీ సమావేశానికి  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ని పిలవకపోవడాన్ని సీనియర్ నాయకుడు హన్మంతరావు లేవనెత్తరు. పీసీసీ మాత్రం సమాచారం ఇచ్చామని..ఆయనే రాలేదని జవాబిచ్చారు. ఇక కేవీపీ తెలంగాణ వాడిని అని చెప్పుకుంటున్న తరుణంలో  పోతిరెడ్డిపాడు కి వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు పిలవాలని కోరారు వీహెచ్. మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పోరుబాటపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: