ప్రముఖ గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి కి ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కేవలం గాయనిగా మాత్రమే కాకుండా సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తూ ఉంటుంది చిన్మయి . ఎప్పుడు ఏదో ఒక సామాజిక సమస్యలు తెరమీదకు తెస్తు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. తాజాగా చిన్మయి  ఓ విషాద గాథను తెరమీదికి తెచ్చారు  అందరికీ ఒక కథను వినిపించింది . ఓ బాధితురాలు తన ద్వారా ఈ కథను అందరికీ తెలియజేయాలని అనుకుంది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాక ప్రస్తుతం చిన్మయి  ఈ కథకు సంబంధించి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అంతే కాకుండా సదరు బాధిత మహిళ తనకు చేసిన మెసేజ్ లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

 


 నేను నా విషాద గాథను తమిళనాడులోని అందరూ మహిళలకు మీ ద్వారా తెలియ చేయాలని అనుకొంటున్నాను అంటూ ఆ మహిళ తన కథను మొదలు పెడుతుంది. తను తన పక్కింటి అబ్బాయిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. తాను మ్యారేజ్  చేసుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు అబ్బాయికి ఎంతగానో కట్నం  ఇచ్చారని అంతేకాకుండా తాను  ఒక్కగానొక్క కూతురు అని... అయితే పెళ్లి జరిగిన తర్వాత రోజు నుండే  అదనపు కట్నం కోసం వేధింపులు మొదలు పెట్టారు అని చెప్పింది . తన తండ్రి డిప్యూటీ కలెక్టర్... కుటుంబ కౌరవ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయ కుండా సైలెంట్ గానే వున్నారు అంటూ చెప్పుకొచ్చింది.తన భర్త తనను  దారుణంగా కొట్టాడు అని ఆ తర్వాత తనకి ఇద్దరు కవల పుట్టిన తర్వాత మళ్లీ అదనపు కట్నం కోసం వేధించటం మొదలుపెట్టాడు అంటూ చెప్పుకొచ్చింది. 

 

 ఇక ప్రస్తుతం ఏకంగా  తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా దారుణంగా తన భర్త కొట్టాడని ప్రస్తుతం తన తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉండగా వారితో నేను ఉన్నాను అంటు తెలిపింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన చిన్మయి.. కూతురికి ఇబ్బంది వస్తే కుటుంబ గౌరవం కోసం అడ్జస్ట్ అవమన్నారు.. ఇప్పుడు ఏకంగా తల్లిదండ్రుల పైన సదరు చేయి చేసుకున్నాడు  కుటుంబ గౌరవం మొత్తం పోయింది అంటూ సదరు మహిళ చెప్పిందని... నాకు ఒకటి అర్థం కావడం లేదు ప్రాణాలు ఉంటే చాలు కదా కుటుంబం గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనేది అర్థం కాలేదు ఉంటూ తెలిపింది. ఈ గృహ హింస గురించి విని తల తిరుగుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది చిన్మయి.

మరింత సమాచారం తెలుసుకోండి: