కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీకి చాలా దీటుగా ఎప్పటినుండో రాజకీయాలు చేస్తోంది మమతాబెనర్జీ. కరోనా వైరస్ కష్టకాలంలో గాని మరియు అంతకుముందు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల టైంలో గాని ఏమాత్రం కేంద్రానికి చాన్స్ ఇవ్వకుండా మమత దూకుడు ప్రదర్శించింది. ఇటీవల కరోనా వైరస్ వచ్చిన టైంలో లాక్ డౌన్ పొడిగించే విషయంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అందరి ముందు మోడీపై సీరియస్ అవ్వటం పెద్ద హైలెట్ అయిన విషయం అందరికి తెలిసిందే. కావాలని నరేంద్ర మోడీ సర్కార్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు మమతా బెనర్జీ చేయడం మనం విన్నాం.

 

త్వరలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో మోడీ కేంద్ర ప్రభుత్వ అధికారుల చేత ఇక్కడ అరాచకాలు, ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని మమతాబెనర్జీ అప్పట్లో ఆరోపించారు. ఈ విషయం నడుస్తూ ఉండగానే ఇటీవల తుఫాను రావటంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రజలు చాలావరకు నష్టపోయారు. సరైన సౌకర్యాలు అందుబాటులో లేక ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రకృతి చేసిన నష్టం నుంచి బయట పడటానికి కొంత టైం ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా కరోనా, లాక్ డౌన్, వలస కూలీలు సమస్య, తుపాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడ్డాయని ఆమె అన్నారు.

 

ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రజలు సహకరించాలని కోరారు. తుపాను వల్ల గాయపడిన వారికి రూ.25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే వారి చికిత్సకయ్యే ఖర్చును కూడా భరిస్తామన్నారు. తన నివాసంలో కూడా విద్యుత్తు సౌకర్యం, ఫోన్ నెట్ వర్క్ సరిగా లేదని మమత బెనర్జీ తెలిపారు. ఇదే సమయంలో తన సర్కార్ పై కొంతమంది తప్పుడు రాజకీయాల ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. మొత్తంమీద చూసుకుంటే ఎన్నికల ముందు కరోనా వైరస్ లాక్ డౌన్, తాజాగా వచ్చిన తుఫాన్ పూర్తిగా మమతా బెనర్జీని ఇబ్బందుల్లోకి నెట్టేసింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: