ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న తరుణంలో.. మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమలు చేయడంతో వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు లేక అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వారు జీవనం కొనసాగిస్తున్న ఊర్లలో నివసించ లేక సొంత ఊళ్లకు వెళ్లేందుకు.. రకరకాలుగా అంటే సైకిల్ పై, నడుచుకుంటూ వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఎలాంటి కష్టాలు పడుతున్నారో తెలిపే సంఘటనలు ఇప్పటికే చాలానే  చూసాము. ఇక తాజాగా మరో సంఘటన అందరినీ కలిచివేసింది.

 

ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.  పంజాబ్ లోని లుధియానా చెందిన ఒక మహిళ వంద కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి... హర్యానాలోని అంబాలాకు చేరుకోవడం జరిగింది. మామూలుగా ఉన్న ప్రజలకే అంత దూరం కాలినడక ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆమె ఒక గర్భిణీ. ఇక అంబాలాకు చేరుకోవడంతో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీనితో ఆమె ఒక ఆడ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. కానీ ఆ పాప కొద్దిసేపటికే మరణించింది. ఇక ఆ బిడ్డను ఖననం ఆ ప్రాంతంలోనే నిర్వహించడం జరిగింది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే... బీహార్ కు చెందిన బిందియా, రామ్  రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇక వారు గడిచిన సంవత్సరమే బీహార్ నుంచి లూధియానా కు వలస వచ్చారు. అప్పటి నుంచి రామ్ ఒక ఫ్యాక్టరీలో కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక కరోనా పరిస్థితి వల్ల రామ్ ఉద్యోగం కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి.. వారికి సరైన భోజనం కూడా తినలేని పరిస్థితి వచ్చింది.

 

గర్భిణీగా ఉన్న ఆమె ఎన్నో పోషకాలు తీసుకోవాల్సిన సమయంలో.. మంచినీళ్లతో కడుపు నింపుకునేది. ఇలా దారుణమైన పరిస్థితిలో వారు సొంత ఊర్లకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. వారికి ప్రత్యేక రైలు సదుపాయం అందించకపోవడంతో అంబాలా నుంచి వారి సొంత ఊరికి కాలినడకన ప్రయాణం చేయాలని సిద్ధమయ్యారు. ఆ ప్రాంతానికి చేరుకున్న అనంతరం ఆమెకు పురుటి నొప్పులు మొదలయ్యాయి. దీనితో వారు  పోలీస్ అధికారుల సహాయంతో  దగ్గర లో ఉండే ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆమె ఒక ఆడ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. అంతా బాగుంది కానీ చివరకు ఆ పసిబిడ్డ కొద్దిసేపటికే ప్రాణాలు విడిచి తిరిగి రాలేని లోకానికి వెళ్లిపోయింది. దీనితో ఆ జంట కన్నీరుమున్నీరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: