క‌రోనా విష‌యంలో ముందు నుంచి ఏపీ, తెలంగాణ విష‌యంలో ర‌క‌ర‌కాల పోలిక‌లు వ‌చ్చాయి. క‌రోనా ప్రారంభ స‌మ‌యంలో సీఎం కేసీఆర్ దూకుడుగా ఉండేవారు. ప‌దే ప‌దే ప్రెస్ మీట్లు పెట్ట‌డంతో పాటు లాక్ డౌన్ విష‌యంతో పాటు ఇత‌ర‌త్రా జాగ్ర‌త్త‌ల విష‌యంలో చాలా ఎలెర్ట్‌గా ఉండేవారు. అదే స‌మ‌యంలో ఏపీలో క‌రోనా కేసులు అంత‌గా లేవు. ఒక్క నెల్లూరులో మాత్ర‌మే ఒక్క కేసు న‌మోదు అయ్యింది. ఆ త‌ర్వాత త‌బ్లిగీ కేసులు బ‌య‌ట‌కు రావ‌డంతోనే ఏపీలో క‌రోనా కేసులు ఒక్క‌సారిగా కోర‌లు చాచాయి. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో ఏకీభ‌విస్తూ ప‌లుసార్లు ఏపీలోనూ లాక్ డౌన్ పొడిగించారు.

 

ఇక క‌రోనా విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ముందుగా ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా త‌ర్వాత క‌రోనా అనేది మ‌న‌తో పాటే ఉంటుందని.. దీని విష‌యంలో క‌లిసి న‌డ‌వ‌క త‌ప్ప‌ద‌న్న విష‌యం ఆయ‌న‌కు అర్థ‌మైంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ క‌రోనాతో క‌లిసి కాపురం చేయ‌క త‌ప్ప‌ద‌ని.. ఇది భ‌విష్య‌త్తులో నాకు అయినా.. ప్ర‌తి ఒక్క‌రికి అయినా రాక త‌ప్ప‌ద‌ని చెప్పారు. జ‌గ‌న్ ఈ మాట‌లు మాట్లాడిన‌ప్పుడు ప్ర‌తిప‌క్షాల నుంచి దేశంలో ప‌లువురు సీఎంలు చాలా చుల‌క‌న‌గా చూశారు.. హేళ‌న చేస్తూ మాట్లాడారు. అయితే ఆ త‌ర్వాత కేవ‌లం మ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కే కాకుండా.. దేశ ప్ర‌జ‌ల‌కు చివ‌ర‌కు ప్ర‌పంచానికి కూడా క‌రోనా తో క‌లిసి కొన్ని రోజుల పాటు మ‌నం జీవితం న‌డిపించు కోక త‌ప్ప‌ద‌న్న విష‌యం గ్ర‌హించారు. 

 

అటు మ‌రో తెలుగు రాష్ట్ర సీఎం అయిన కేసీఆర్ మాత్ర‌మే కాదు.. దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంల నుంచి చివ‌ర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను ఫాలో అవ్వ‌క త‌ప్ప‌లేదు.. జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించ‌క త‌ప్ప‌లేదు. ఇక ఇప్పుడు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా అదే చెబుతుందన్న విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రు గ‌మ‌నిస్తున్నారు. ఇక క‌రోనా కాలంలోనూ సంక్షేమ ప‌థ‌కాలు కొన‌సాగించిన ఘ‌న‌త వైఎస్ . జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక ముందుగా క‌రోనాపై జ‌గ‌న్ మాట్లాడిన మాట‌ల‌ను ట్రోల్ చేసి పైశాచికానందం పొందిన ప్ర‌తి ఒక్క‌రు ఇప్పుడు ఏమంటారో ?  ఏమ‌ని ట్రోల్ చేస్తారో ?  వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేయాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: