ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలం జులైలో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అన్న భయం పెరుగుతోంది. రోజువారి అత్యధిక కేసుల విషయంలో ప్రపంచంలో ఐదో స్థానంలో కి చేరింది భారత్. మొత్తం కేసుల విషయంలో 11 వ స్థానంలో ఉన్న ఇండియా త్వరలోనే టాప్ టెన్ లోకి చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆంక్షలు సడలించడంతో రోజువారి కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల 24 గంటల్లో 6654 కేసు నమోదు కావడంతో నిపుణులు మరియు ప్రభుత్వ వర్గాలకి టెన్షన్ పట్టుకుంది. 

 

 

దీంతో రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నా దేశాలలో అమెరికా, రష్యా, బ్రెజిల్, బ్రిటన్ తర్వాత స్థానంలో ఇండియా ఉంది. ఏప్రిల్ 20 నుండి లాక్ డౌన్ ఆంక్షలు సడలించడం ప్రారంభమైన తర్వాత కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. మే 1 వరకు రోజువారీ కొత్త కేసుల సంఖ్య 2400 లోపే ఉండేవి. మే 7 తర్వాత పరిస్థితి చూస్తే అది మూడు వేలు దాటింది. ఇదిలా ఉండగా ఇటీవల గత వారం రోజుల నుండి రోజుకి ఐదు వేల నుండి ఆరు వేల మధ్య కొత్త కేసులు బయటపడుతున్నాయి. మే 19న 24 గంటల్లో 4970 కేసులు బయటపడ్డాయి. 

 

ఆ తర్వాత నుండి రోజు కేసుల సంఖ్య 5,000 మరియు 6000 మధ్య కేసులు బయట పడుతున్నాయి. అయితే కేసులు పెరగటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. ఎప్పటికప్పుడు మీడియాకి కరోనా గురించి తెలియజేసే మీడియా బులిటెన్ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఆపేసింది. ఇటువంటి పరిస్థితి చూస్తే వైద్య నిపుణులు చెబుతున్నట్లు జూలైలో లక్షల్లో కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే వచ్చే జూలై మాసంలో ఇండియాకి ప్రమాదం పొంచి ఉందని ప్రస్తుత పరిస్థితి బట్టి అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: