ఉత్తర కొరియా అధినేత‌ కిమ్ జోంగ్ ఉన్ మ‌ళ్లీ క‌నిపించాడు. సుమారు 20 రోజుల త‌ర్వాత ఆయ‌న కీల‌క స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ నెలారంభంలో ఎరువుల క‌ర్మాగారం ప్రారంభంలో కిమ్ క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు కిమ్ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఇప్పుడు ఏకంగా దేశ అణ్వాయుధ సామగ్రిని బలోపేతం చేయడం, సాయుధ దళాలను అప్రమత్తం చేయడంపై ఆయ‌న సైనిక‌ స‌మావేశం నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. ఈ కీల‌క‌మైన సైనిక స‌మావేశంలో కిమ్ పాల్గొన్న ఫొటోను మీడియాకు విడుద‌ల చేసింది. నిజానికి.. ఎరువుల క‌ర్మాగారం ప్రారంభంలో పాల్గొన్న‌ది నిజ‌మైన కిమ్ కాద‌ని, ఆయ‌న డూప్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ఏకంగా సైనిక స‌మావేశం నిర్వ‌హించి.. ప్ర‌పంచానికి ఏ సంకేతాల‌ను పంపాడన్న‌దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి.. కిమ్‌కు అణ్వాయుధాల ప‌రీక్ష‌లంటే చాలా స‌ర‌దా అని అంటుంటారు. ఈ స‌మావేశంలో అటు అమెరికా, ఇటు ద‌క్షిణ కొరియా మిల‌టరీల‌కు స్ప‌

 

ష్ట‌మైన సూచ‌ల‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. సైనిక కమిషన్‌కు నాయకత్వం వహిస్తున్న కిమ్, సైనిక ధైర్యాన్ని పెంచే ప్రయత్నంలో డజన్ల కొద్దీ ఆర్మీ జనరల్స్, ఇతరుల ర్యాంకులను ప్రోత్సహించడానికి ఈ సమావేశాన్ని కిమ్‌ ఉపయోగించిన‌ట్లు మీడియా పేర్కొంటోంది. ఇక్క‌డ మ‌రొక టాక్ కూడా వినిపిస్తోంది. అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరపడంపై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించిన‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఉత్తర కొరియాపై అమెరికా నేతృత్వంలోని ఆంక్షలపై వివాదాల కారణంగా 2019 ఫిబ్రవరిలో కిమ్- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన రెండో శిఖరాగ్ర సమావేశం ఎటువంటి ఒప్పందం లేకుండా ముగియడంతో ఇరు దేశాల దౌత్యం క్షీణించిన విష‌యం తెలిసిందే. ఆదివారం జ‌రిగిన స‌మావేశంలో ప్రధాన రోడాంగ్ సిన్మున్ వార్తాపత్రిక కిమ్ తన ట్రేడ్మార్క్ డార్క్ మావో సూట్‌లో ప్రసంగం చేస్తూ, ఒక పత్రంపై రాస్తూ.., పోడియంలోని బోర్డు వద్ద కర్రను చూపించే ఫోటోలను విడుదల చేసింది. ఆలివ్ గ్రీన్ యూనిఫాం ధరించిన కిమ్ ఫొటో వైర‌ల్ అవుతోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: