మూడు రోజుల క్రితం బెంగళూరు నగరంలో వింత శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళానకు గురయ్యారు. నగరవాసులు బెంగళూరు నగరంలో బుధవారం రోజున మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 1.50 గంటల వరకు వింత శబ్దాలు విన్నామని... భూకంపం లేదా యుద్ధ విమానాల శబ్దం అయి ఉండవచ్చని తాము భావించామని చెప్పారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల ప్రజలు ఈ వింత శబ్దాల గురించి ఫిర్యాదు చేశారని అధికారులు చెప్పారు. 
 
అయితే ఎట్టకేలకు ఈ వింత శబ్దాల మిస్టరీ వీడింది. రక్షణ శాఖ సోనిక్ బూమ్ వల్ల ఈ శబ్దాలు వినిపించాయని వెల్లడించింది. అయితే ఈ వింత శబ్దాల వెనుక అసలు మర్మం వేరే ఉంది. భారత్ రోజురోజుకు శక్తివంతమైన దేశంగా మారుతోంది. భారత్ ప్రస్తుతం సొంతంగా అణు పరీక్షలు చేస్తోంది. శాటిలైట్ ప్రయోగాలు సొంతంగా చేస్తూ ఇతర దేశాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. రాకెట్ విధ్వంస క్షిపణులు భారత్ సొంతంగా తయారు చేస్తోంది. 
 
భారత్ ప్రయోగాలతో ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తాజాగా బెంగళూరులో వినబడిన వింతశబ్దాల గురించి నిపుణులు స్పందిస్తూ బుధవారం రోజున బెంగళూరులో వినపడిన వింతశబ్దాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుకోయి 30 ఎం.కే.ఐ నుండి వచ్చిందని... వర్టికల్ టేకాఫ్ జరిగే సమయంలో ఆ శబ్దాన్నే ప్రజలు విని వింత శబ్దాలుగా భావించారని చెప్పారు. వర్టికల్ టెకాఫ్ జరిగే సమయంలో సోనిక్ బూమ్ ఏర్పడుతుందని తెలిపారు. 
 
ఎయిర్ ఫోర్స్ అధికారులు రొటీన్ డ్రైవ్ లలో భాగంగానే జెట్ ఎగిరిందని చెబుతున్నారు. మరోవైపు భారత్ సరిహద్దుకు దగ్గరలో పాక్ సైన్యం ఒక ఎయిర్ బేస్ ను కడుతున్నట్టు ఒక వ్యక్తి పెట్టగా భారత్ సైన్యం నిజమేనని ధ్రువీకరించింది. పాక్ ఎయిర్ బేస్ శ్రీనగర్ నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుకోయి 30 కు ఎయిర్ బేస్ ను ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది. బుధవారం రోజున బెంగళూరు నగరంలో మాక్ డ్రిల్ జరిగిందని భారత్ పాక్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: