ఏపీలో స్ధానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి కాని.. లేక‌పోతే ఈ పాటికి అన్ని జిల్లాల్లో టీడీపీలో కీల‌క నాయ‌కులు.. ద్వితీయ శ్రేణి కేడ‌ర్ చాలా వ‌ర‌కు ఖాళీ అయిపోయేది అన‌డంలో సందేహం లేదు. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఎన్నిక‌లు వాయిదా వేయ‌కుండా ఉండి ఉంటే ఈ పాటికి టీడీపీ లో మిగిలిన ఉన్న కేడ‌ర్ కూడా ఎప్పుడో బ‌య‌ట‌కు వ‌చ్చేసేది. ఈ లోగా క‌రోనా కాస్త కోర‌లు చాచ‌డంతో టీడీపీ వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇక క‌రోనా దెబ్బ‌తో ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డం చంద్ర‌బాబుకు చాలా వ‌ర‌కు ప్ల‌స్ అయ్యింద‌నే చెప్పాలి.

 

ఇప్పుడు కీల‌కమైన వైజాగ్ కార్పొరేష‌న్ పై చంద్ర‌బాబు ముందు నుంచి క‌న్నేశారు. విశాఖ హుదూద్ తుఫాన్ టైంలో చంద్ర‌బాబు అక్క‌డ హ‌డావిడి చేసిన‌ప్ప‌టి నుంచి అక్క‌డ బాబుకు కాస్త మంచి పేరు ఉంద‌న్న అభిప్రాయం టీడీపీ వాళ్ల‌కు ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది టీడీపీ రాష్ట్రం అంత‌టా చిత్తుగా ఓడిపోయినా కూడా వైజాగ్ న‌గ‌రంలో మాత్రం ఏకంగా న‌లుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచారు. దీంతో ఇక్క‌డ కార్పొరేష‌న్ ను కూడా టీడీపీ ఖాతాలో వేసుకోవాల‌ని చంద్ర‌బాబు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 

వైజాగ్ కార్పొరేష‌న్ టీడీపీ ఖాతాలో వేసుకుంటే .. మాన‌సికంగా వైసీపీని దెబ్బ‌తీసిన‌ట్ల‌వుతుంద‌న్న‌దే బాబోరు ప్లాన్‌. ఈ విష‌యం ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్ సైతం తాను ముందు ప్లాన్లు వేసుకుంటూ వైజాగ్‌లో టీడీపీకి ఎప్ప‌టిక‌ప్పుడు బ్రేకులు వేసుకుంటూ వ‌స్తున్నాడు. ఇక మొన్న గ్యాస్ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు కేవ‌లం రెండు రోజుల్లో స‌మ‌స్య‌ను పూర్తిగా ప‌రిష్క‌రించి ఔరా అనిపించారు. అంతెందుకు చివ‌ర‌కు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు సైతం జ‌గ‌న్‌ను మెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఇదే న‌గ‌రానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గ‌ణ‌బాబు, వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌, గ‌ణ‌బాబు ఇద్ద‌రూ కూడా పార్టీ మారిపోతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

 

సో ఈ లెక్క‌న చూస్తే ఎలాగైనా వైజాగ్ కార్పొరేష‌న్‌పై త‌మ పార్టీ జెండా ఎగ‌రేసి మాన‌సికంగా పైచేయి సాధించాల‌నుకున్న చంద్ర‌బాబు ఎత్తుకు జ‌గ‌న్ పైఎత్తుతో చెక్ పెట్టేస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: