కరోనా వైరస్ వల్ల పాకిస్తాన్ దేశం విలవిలలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో మెడిసిన్ కూడా రాకపోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి అనేక దేశాల శాస్త్రవేత్తలు రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు. అయితే ఈ వైరస్ కి వ్యాక్సిన్ లేకపోవటంతో నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రపంచదేశాల నాయకులు తమ ప్రజలను కాపాడుకుంటున్నారు. దీంతో లాక్ డౌన్ వల్ల కూడా వైరస్ కంట్రోల్ రాని పరిస్థితి ఉండటంతో మరోపక్క ఆర్థిక మాంద్యం ఏర్పడటంతో చాలా దేశాలో లాక్ డౌన్ ఎత్తివేయడం జరిగింది. 

 

ఇదే సమయంలో పాకిస్థాన్ దేశంలో కూడా లాక్ డౌన్ ఎత్తివేశారు. ఇటీవల రంజాన్ మాసం కావడంతో పండుగ దగ్గర పడటంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పాకిస్థాన్ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల ఒక రోజే 1743 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పాకిస్థాన్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,437కు చేరింది. ఈ మొత్తం కేసులలో అత్యధికంగా సింధ్‌లో 20,883, పంజాబ్‌లో 18,730, ఖైబర్‌ పక్తుంఖ్వాలో 7,391, బలూచిస్థాన్‌లో 3,198, ఇస్లామాబాద్‌లో 1457, గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లో 607, పీఓకేలో 171 కేసులు నమోదయ్యాయి. 

 

వారిలో 16,653 మంది డిశ్చార్జి కాగా, 1101 మంది మృతిచెందారు. మిగిలిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో రంజాన్ పురస్కరించుకుని లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరగడంపట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సరిగ్గా పండుగకి ఒకరోజు ముందు ఈ విధమైన ప్రమాదకరమైన పరిస్థితి నెలకొనడంతో, పాకిస్థాన్ దేశంలో జనాలు బయటకు రావడానికి తెగ భయపడిపోతున్నారు. కరోనా వైరస్ విలవిలలాడుతున్న తరుణంలో రంజాన్ పండుగ మాసమైన గాని పాకిస్తాన్ రోడ్లన్నీ బోసిపోయాయి. మొత్తంమీద చూసుకుంటే పాకిస్థాన్ దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది అని అంటున్నారు వైద్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: