కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన చాలా మంది మానసిక పరిస్థితి రోజురోజుకూ క్షీణించిపోతుంది. ఎక్కువగా బయట ప్రదేశాల్లో తిరిగే వ్యక్తులు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమవ్వడం తో వారి పరిస్థితి మాటల్లో వర్ణించలేనంత దారుణంగా తయారయింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే చాలామంది తమ దేశ, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉంటూ తమ వంతు సాయంగా పేద ప్రజలకు విరాళాలు ఇస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ లాంటి మరికొంతమంది ధనికుల నుండి విరాళాలు సేకరించి పేద ప్రజలకు అందిస్తున్నారు. మరి కొంతమంది ఆడవారు తమ నగ్న ఫోటోలను ఆన్లైన్ లో అమ్ముకుంటూ... వచ్చిన డబ్బులను తిండి లేక బాధపడుతున్న వారి కోసం ఖర్చు పెడుతున్నారు. అయితే తాజాగా ఒక యువతి ఏకంగా తన శీలాన్ని అమ్ముకోని వచ్చిన డబ్బులను కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలనుకుంది. 


పూర్తి వివరాలు తెలుసుకుంటే... ఇండోనేషియాకి చెందిన యువతి సారా సల్సాబిల(సారా కెఇహ్ల్) తన శీలాన్ని వేలం పాట పాడాలనుకుంది. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా... ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈమె పెట్టిన వీడియో ప్రపంచవ్యాప్తంగా పెద్ద కాంట్రవర్సీ కి దారి తీసింది. కరోనా పై పోరాటం చేసే వారి కోసం ఫండ్స్ రైజ్ చేయాలనే ఉద్దేశంతో తాను తన శీలాన్ని వేలం పాట పాడుతున్నాను అని ఆమె చెప్పడంతో అందరూ తీవ్ర స్థాయిలో ఆమెపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత తన తప్పు తాను తెలుసుకొని ఇంస్టాగ్రామ్ వేదికగా క్షమాపణ చెప్పింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

. 😱😱😱😱

A post shared by OFFICIAL LAMBE TURAH ENTRNT (@lambe_turah) on


ఈ యువతి వీడియో లో మాట్లాడుతూ... నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను. అది ఏంటంటే నా శీలాన్ని ఒక కోటి రూపాయలకు( భారత దేశ కరెన్సీ లోకి మార్చబడింది) అమ్మాలి అనుకుంటున్నాను. వేలంలో వచ్చిన డబ్బులన్నీ నూటికి నూరు శాతం కోవిడ్ 19 పై పోరాట యోధులకు నేను విరాళం ఇస్తాను. ఇక అవసరం ఉన్న పేద ప్రజలకు కూడా ఆ డబ్బులు ఇస్తాను', అని తన మాతృభాషలో చెప్పుకొచ్చింది. అయితే ఆమె అప్లోడ్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. అలాగే చాలా మంది నెటిజన్లు ఆమెను కరువు లో ఉన్న మహిళ అని దూషించడం ప్రారంభించారు. అయితే ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి తొలగించబడింది కానీ అప్పటికే ఆమె ఫాలోవర్లు ఈ వీడియో ని తమ అకౌంట్లలో షేర్ చేశారు. ఏదేమైనా ప్రస్తుతం ఈమె చేసిన పని అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. ఇకపోతే సారా లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేస్తుంది.

 

శీలం వేలం పాట పాడడం అంటే... ఎవరైతే ఎక్కువ డబ్బులు పాడతారో ఆ వ్యక్తి వేలం పాట పాడిన యువతితో మొట్టమొదటిగా శృంగారంలో పాల్గొనవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: