కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కేంద్రం లాక్ డౌన్  విధించడంతో దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్ లు అన్నీ ఆగి పోయాయి. మార్చి నెల నుండి ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీ సినిమా హీరోలు మరియు హీరోయిన్లు, డైరెక్టర్లు అంత ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి సమయంలో కేంద్రం ఇటీవల కొన్ని విషయాలలో ఆంక్షలు ఎత్తివేసి సడలింపులు ఇవ్వటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు సినిమా షూటింగులకు పర్మిషన్ అడగడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సినిమా షూటింగ్ లకు, సీరియల్ షూటింగ్ లకు ఎవరు అడగకుండానే అనుమతులు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో సింగిల్ విండో అనుమతులు ఇస్తూ జీవో జారీ చేయడం జరిగింది. 

 

ఈ సందర్భంగా వైయస్ జగన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ తరఫున మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై చర్చించడానికి రెడీ అవుతున్నట్లు, వైయస్ జగన్ ని కలవబోతున్నట్లు చిరంజీవి వివరించారు. అంతేకాకుండా ఈ సమయములో పరిశ్రమలో అన్ని విభాగాల నుండి ప్రతినిధులతో త్వరలోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి కలుస్తున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో చిరంజీవి పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్ల నుండి తీవ్రస్థాయిలో ప్రతిస్పందన వస్తోంది. 

 

పొలిటికల్ మెగాస్టార్ తో సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్ చిరంజీవి బేటీ కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం, ఇండస్ట్రీకి మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాము అని నెటిజన్లు అంటున్నారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ షూటింగ్ పర్మిషన్ ల కోసం చిరంజీవి పడుతున్న కష్టాన్ని బట్టి చాలామంది కొనియాడుతున్నారు. మరికొంతమంది ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలంటే చిరంజీవి తర్వాతే ఇంకెవరైనా అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ కి సెటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: