ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు గజగజా వణుకుతున్నాయి. కొన్ని జంతువుల మాంసం తినడం వల్ల ఈ వైరస్ పుట్టిందని పలువూ శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 
 
పరిస్థితి అదుపులోకి వచ్చిందని లాక్ డౌన్ ను ఎత్తేసిన చైనాలో మరోసారి వైరస్ విజృంభణ మొదలైంది. వుహాన్ లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే పరిశోధకులు చేసిన పరిశోధనల్లో మాంసాహారం తినేవారిలో ముఖ్యంగా గబ్బిలాలు తినేవారిలో రోగ నిరోధక శక్తి వేగంగా తగ్గుతోందని తేలింది. గబ్బిలాలు, పాములు తినే వారికి ఈ వైరస్ వేగంగా సోకుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
గబ్బిలాలు, పాములు తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని కరోనా తగ్గిన వారిలో వైరస్ ఈ ఆహారాలు తినడం వల్ల విజృంభిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గబ్బిలాలు, పాములు అమ్మడం, తినడంపై చైనా దేశం నిషేధం విధించింది. ఈ రెండు ఆహారాలను చైనా నిషేధించటంతో వైరస్ అదుపులోకి వస్తుందని ఆ దేశం భావిస్తోంది. 
 
మరోవైపు భారత్ లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో గత మూడు రోజుల నుంచి ప్రతిరోజూ 6,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,31,868 కరోనా కేసులు నమోదయ్యాయి. 54,441 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 3,867 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 1813 కరోనా కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,627 కరోనా కేసులు నమోదయ్యాయి.      

మరింత సమాచారం తెలుసుకోండి: