తెలంగాణలో టెన్త్‌ విద్యార్ధులకు ముఖ్య గమనిక...!  పరీక్షల తేదీని ప్రభుత్వం ప్రకటించేసింది.  ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటోంది.  ఇక ఈ 15 రోజులు మరోసారి రివిజన్‌ చేసుకుని.. ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచిస్తోంది సర్కార్‌.  

 

మార్చిలో  జరగాల్సిన టెన్త్‌ పరీక్షలు కరోనా కారణంగా కోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. అయితే అప్పటికే మూడు పరీక్షలు జరిగాయి. అయితే కోర్టు అనుమతి తీసుకుని మిగిలిన పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం... అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వచ్చే నెల మూడున పరిస్థితి రివ్యూ చేయాలని చెప్పిన న్యాయస్థానం... పలు ఆదేశాలు కూడా ఇచ్చింది.  వాటి ప్రకారం షెడ్యూల్‌ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 

 

జూన్ 8 నుండి జులై 5 వరకు పరీక్షలు జరగనున్నాయి.  పరీక్షకు పరీక్షకు మధ్య రెండ్రోజులు గ్యాప్‌ ఉంటుంది. కరోనా కారణంగా పరీక్షా కేంద్రాల్ని పెంచి,... 4 వేల 5 వందల 35 చేశారు. అలాగే 68 వేల మంది సిబ్బంది నిర్వహణలో భాగస్వామ్యం కానున్నారు. అలాగే రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినప్పటికే తల్లిదండ్రులే నేరుగా పరీక్షా కేంద్రాలకు తమ పిల్లల్ని తీసుకొస్తే మంచిదంటోంది ప్రభుత్వం. విద్యార్ధులకు మాస్క్‌లు, శానిటైజర్లు సెంటర్లలోనే ఇస్తారు. ఇటు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.  ప్రతీ సెంటర్లో థర్మల్‌ స్క్రీనింగ్‌కూడా ఏర్పాటు చేశారు. విద్యార్ధి, విద్యార్ధి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా ఏర్పాటు చేశారు. మరో విషయం ఏంటంటే కంటైన్మెంట్‌ జోన్ల నుంచి వచ్చే స్టూడెంట్స్‌ కోసం ప్రత్యేక రూములు ఏర్పాటు చేస్తున్నారు.

 

ఇక టెన్త్‌ పరీక్షలకు 5 లక్షల 35 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారి కోసం జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలో హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్ధుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ పాఠశాలలకు హాస్టల్స్ తెరుచుకునేందుకు అనుమతి ఇస్తోంది సర్కార్‌. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: