భారత దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ ఇలాంటి విపత్తు కలిగిస్తుందో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రంగం, ఆ రంగం అని తేడా లేకుండా ప్రతి దాని అభివృద్ధిలోనూ కుంటుపడింది. దేశంలో కరోనా వ్యాప్తి ఆపడానికి ఇప్పటివరకు నాలుగో సారి లాక్ డౌన్ దేశంలో కొనసాగిస్తున్నారు. దీనితో వలస కూలీలు, ఉద్యోగస్తులు అనేక మంది జీవనోపాధి కోల్పోవడం జరిగింది.


ఇక అలా అది ఉంటే మరోవైపు లాక్ డౌన్ కారణంగా దేశంలోని ప్రతి దేవాలయాన్ని మూసి వేయడం జరిగింది. మూసివేయడం అంటే కేవలం భక్తుల్ని అనుమతించకపోవడం మాత్రమే. ఆ గుడికి సంబంధించిన పూజారులు మాత్రం దేవుడికి నిత్య నైవేద్యాలు అందజేస్తూనే ఉంటారు. కలియుగ దైవం ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ఇదే పరిస్థితి. ఎంత పెద్ద పాలకవర్గం ఉన్నా కేవలం పూజారులు మాత్రమే దేవుని సేవ చేస్తూ భక్తులు ఎవరు లేకుండా తిరుమల కొనసాగుతుంది. 


అయితే ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలలో టీటీడీ కళ్యాణ మండపంలో మే 25 అనగా సోమవారం నాటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుక రాబోతుంది. అయితే కొత్తగా శ్రీవారి లడ్డూ ప్రసాదం సమాచారం కొరకు టిటిడి టోల్ ఫ్రీ నీ నెంబర్ 18004254141/ 1800425333333 లను ఇచ్చింది. 


ఇకపోతే గతంలో ప్రకటించిన శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో, ఆలయ పోటు పేస్కార్ నెంబర్ లకు బదులుగా టీటీడీ, కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్లు కొత్తగా తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా భక్తులు ఎన్ని లడ్డులు కావాలి, లడ్డు ఎక్కడ లభిస్తాయి, దాని ఖరీదు ఎంత, ఇలా ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వాటిని నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ పాలక మండలి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: