మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రాకు దూరమైన అచ్చంగా ఈ నెల 25 తేదీకి 67 రోజులు అవుతుంది. ఆ రోజున ఏపీకి రావాలని బాబు అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఇపుడు రాష్ట్రానికి వస్తారట. ఆయన విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధితులను పరామర్శిస్తారట. అదే విధంగా అటునుంచి అటే అమరావతికి  వస్తారట.

 

ఇదంతా మీడియాలో చూడడం తప్ప ఏపీ సర్కార్ కి తెలియదు అంటున్నారు. ఇక తెలంగాణా డీజీపీకి చంద్రబాబు తన పర్యటన గురించి తెలియచేశారని, ఆయన అనుమతి ఇచ్చాడని అంటున్నారు. ఏపీ డీజీపీ మాత్రం ఇంకా అనుమతికి ఆమోదం తెలపలేదని అంటున్నారు. అయితే దీని మీద రాష్ట్ర హోం మంత్రి సుచరిత మాత్రం బాబు పర్యటన గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పుకొచ్చారు.

 

నిజంగా చంద్రబాబు అనుమతి కోరితే ఇస్తామని కూడా అన్నారు. మొత్తానికి బాబు ఏపీకి రావాలని ఇలా దాగుడుమూతలు ఆడుతున్నారా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు ఏపీ పర్యటనకు వస్తే దానిపైన అనుమతించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు.

 

మరో వైపు చూసుకుంటే చంద్రబాబు పొరుగు రాష్ట్రం నుంచి సుదీర్ఘ కాలం తరువాత వస్తున్నారు. ఆయన్ని సెల్ఫ్ క్వారంటైన్ చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. బాబు వస్తే క్వారంటైన్ కి వెళ్లాల్సిందేనని ఇప్పటికే వైసీపీ మంత్రులు చెప్పడం జరిగింది. మరి బాబు దానికి ఒప్పుకుంటారా, ఓ వైపు మహానాడుని నిర్వహించాలని బాబు భావిస్తున్నారు. 

 

రాజకీయానికి ఇదే సరైన టైం అని ఆయన ఏపీకి వస్తున్నారు. తన పర్యటనకు అనుమతులు ఇవ్వకపోయినా, తనను సెల్ఫ్ క్వారంటైన్ చేసినా కూడా నానా యాగీ చేయడానికి బాబు రెడీగా ఉన్నారని  రాజకీయం తెలిసిన వారికి అర్ధమయ్యే విషయం. మరి బాబు వచ్చినా గొడవే, రాకపోయినా గొడవే. చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: