ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రోజురోజుకీ కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న  విషయం తెలిసిందే. దీంతో అనుమతులను కరోనా వైరస్ పేషెంట్ లను అందర్నీ ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్సలు అందించడం పరీక్షలు నిర్వహించడం లాంటివి చేస్తుంది ఏపీ సర్కార్. ఏపీ ప్రజల్లో  కూడా ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతుంది. ప్రజలెవరూ ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఆందోళన చెంది అధైర్యపడవద్దు అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. ఇక కరోనా  వైరస్ పేషెంట్లకు మెరుగైన సదుపాయాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. 

 

 అయితే కరోనా వైరస్ పేషెంట్ ల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. రాజమండ్రిలో కరోనా  వైరస్ పేషెంట్ లకు కొత్త సౌకర్యాన్ని కల్పించేందుకు నిర్ణయించింది. గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో ముగ్గురు కరోనా  వైరస్ పేషెంట్ లకు హోమ్ ఐసోలేషన్  కు అనుమతి ఇచ్చారు అధికారులు. వాస్తవంగా అయితే కరోనా  పేషెంట్లు ప్రభుత్వం సూచించిన ఆస్పత్రిలోనే ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆస్పత్రుల్లో ఉంటే కరోనా  వైరస్ పేషెంట్ లు  ఆందోళన చెందే అవకాశం ఉందని అందుకే... కరోనా  పేషెంట్ లు  ఇంట్లో ఉండి ఐసొలేషన్  లో ఉంటే  మానసిక స్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. 

 


ఈ క్రమంలోనే   ప్రస్తుతం కరోనా  వైరస్ పేషెంట్ లకు హోమ్  ఐసోలేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు  చెప్పుకొచ్చారు. ఇటీవలే చెన్నై నుంచి వచ్చిన భార్య భర్తలు అతని సోదరుడు రాజమహేంద్రవరం రాగా...  చెన్నైలో వారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ లో  సడలింపు ఇచ్చిన తర్వాత వారు సొంత ఊరికి చేరుకున్నారు. ఇక వీరిలోని మహిళకు  కరోనా  నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది... అనంతరం ఆమె భర్తకి భర్త సోదరుడికి కూడా ఈ మహమ్మారి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆందోళన చెందిన వారు.. మమ్మల్ని  ఇంటికి పంపించాలని ఇంట్లోనే ఉంటాము  అని బయటకు రాము  అంటూ హామీ ఇవ్వడంతో అధికారులకు తొలిసారి రాష్ట్రంలో సెల్ఫ్  ఐసోలేషన్  సౌకర్యాన్ని కల్పించారు కరోనా  పేషెంట్లుకు .

మరింత సమాచారం తెలుసుకోండి: