పాకిస్తాన్ ఇరాన్ దేశాలు నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతల దండు దండెత్తుతుంది అనే విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఈ  మిడతల దండు భారత్ పై దండెత్తి ఎంతగానో పంట నష్టం కలిగించి రైతులను  సంక్షోభంలోకి నెడుతున్నాయి. అయితే జూన్ జూలై మాసంలో రావాల్సిన మిడతల  దండు  ప్రస్తుతం ముందుగానే ఇరాన్ పాక్ దేశాలనుంచి భారతదేశంపై దండెత్తుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి కోట్ల సంఖ్యలో మిడతలు ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే భారత భూభాగంలో ని రాజస్థాన్ కి ఈ మిడతల దండు చేరింది. దీంతో అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతున్నారు. మిడతల దండు కారణంగా భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున మిడతల దండును  ఎలా నివారించాలి అనే దానిపై దృష్టి పెడుతున్నారు. 

 

 అయితే ఇప్పటికే రాజస్థాన్ చేరిన ఈ మిడతల దండు ఉత్తర ప్రదేశ్ దిశగా దూసుకుపోతున్నట్లు  అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ దేశాల నుంచి భారత భూభాగంలోకి దూసుకొచ్చి ఈ మిడతల దండు రాజస్థాన్ లోని దైవ జిల్లా వరకు చేరుకున్నాయి. ఇక ఈ  మిడతలు ఆగ్రా సహా యూపీలో 12 జిల్లాలపై పెను ప్రభావం చూపించబోతున్నట్లు  అధికారులు అంచనాలు వేసి అప్రమత్తమయ్యారు. ఇక ఉత్తరప్రదేశ్ వైపుగా మిడతల దండు దూసుకువస్తున్న తరుణంలో 200 ట్రాక్టర్ లను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ట్రాక్టర్ల ద్వారా పలు రకాల రసాయనాలను పిచికారి చేసి అవి అంతరింప  చేయాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 


 గత రెండు రోజుల క్రితం రాజస్థాన్ భూభాగంలోకి దూసుకొచ్చి విడుదల ఈ మిడతల దండు.... గాలి వ్యతిరేక దిశలో వీస్తుండటం కారణంగా ఎక్కడికక్కడ చెల్లాచెదురు అయిపోయాయి. దీంతో కొన్ని మిడతల గుంపులు  మధ్యప్రదేశ్ దిశగా కూడా దూసుకుపోతున్నాయి . ఇక ప్రస్తుతం రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ దూసుకుపోతున్న ఈ మిడతల దండు  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పై మరికొన్ని రోజుల్లో దాడి చేయనున్నట్లు తెలుస్తోంది ఆఫ్రికా ఎడారి ప్రాంతం లో ఉండే ఈ మిడతల దండు ప్రస్తుతం భారత భూభాగంలో దాడి చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఇవి పంటలపై ఒక్కసారి పడ్డాయి  అంటే అక్కడ పంటలు పూర్తిగా ధ్వంసమై పోతాయి. పదునైన దవడలు కాళ్లకున్న నిర్మాణాలతో ముక్కలు ముక్కలుగా కొరికేసి నేలపాలు చేస్తాయి మిడతల దండు. కాగా  అధికారులు ఈ మిడతల దండును   ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: