గ‌త ఏడాది డిసెంబ‌రులో చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా పుట్టుకొచ్చిన‌ కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచం మొత్త‌వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యతో ఆయా దేశ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా ఉద్దృత్తి తీవ్రతరంగా ఉంది.  

IHG

మ‌రోవైపు.. క‌రోనా రోజుకు రోజుకు విజృంభిస్తున్న వేల కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా క‌రోనా వైర‌స్‌ను ఓ టీతో త‌రిమికొట్ట‌వ‌చ్చంటున్నారు నిపుణులు. అదే కంగ్రా టీ. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా లోయలో సాగవుతున్న ఒక రకమైన తేయాకులో ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయి. వాటితో తయారవుతున్నదే కంగ్రా టీ. ఈ టీలో రసాయనాలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నాయి. మందుల కంటే కూడా ఈ కంగ్రా టీ బాగా పనిచేస్తుందని, కరోనా వైరస్ పెరగకుండా అడ్డుకుంటుందని నిపుణులు అంటున్నారు.

IHG

ఈ మేర‌కు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ వెల్ల‌డించారు. కరోనా వైరస్ మన బాడీలోకి వెళ్లాక... అక్కడి ప్రోటీన్ కణాలను తన ఆహారంగా, నివాసంగా చేసుకుంటుంది. ఈ కంగ్రా టీ తాగితే... ఆ ప్రోటీన్ అంతు చూస్తుంది. తద్వారా వైరస్‌కి ప్రోటీన్ కరవై... అది నాశనం అవుతుందన్నది పరిశోధకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికీ ఈ కంగ్రా తేయాకుల్లో సారానికి కొన్ని సుగంధ ద్రవ్యాల నూనెలు కలిపి... ఆల్కహాల్ ఉండే హ్యాండ్ శానిటైజర్లను తయారుచేస్తున్నారు. తేయాకు సారాన్ని, ఇతర మూలికల్నీ కలిపి... సబ్బులు కూడా తయారుచేస్తున్నారు. అందువల్ల కంగ్రా టీ చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: