తాజాగా సోషల్ మీడియా వేదిక మెగా బ్రదర్ నాగబాబు జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సే పుట్టినరోజు సందర్భంగా కొన్ని వివాదాస్పద అభిప్రాయాలను అభిమానులతో పంచుకునే విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే గాంధీని చంపిన విషయం పక్కన పెడితే గాడ్సే ఒక మంచి స్పూర్తిదాయకమైన వ్యక్తి అని నాగబాబు కొనియాడారు. సోషల్ మీడియాలో అతను ప్రకటన చేసిన వెంటనే చాలామంది నాగబాబు పై భగ్గుమన్నారు. పక్కా గాంధేయవాది అయిన పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్లు కూడా వినిపించాయి.

 

దీంతో నేడు అధికారిక ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్.. పార్టీ అధికార ప్రతినిధులు అధికార వేదికలమీద లేదా తమ పార్టీ అధికార సోషల్ మీడియా అకౌంట్ లో వ్యక్తం చేసిన అభిప్రాయాలను మాత్రమే జనసేన పార్టీ అభిప్రాయాలుగా భావించాలని.... నేతల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలు మార్చవద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. నాగబాబు గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తే మహాత్మా గాంధీని దేశ ద్రోహి గా పరిగణించినట్లు అనా.. అని విమర్శలకు సమాధానంగా పవన్ కళ్యాణ్ నాగబాబు తన వ్యక్తిగత అభిప్రాయమని పంచుకోవడంలో తాము ఎటువంటి అడ్డు చెప్పలేదని.. కానీ పార్టీకి అతని వ్యక్తిగత విషయాలకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

 

కానీ పవన్ అన్న కారణంగా అది జనసేన లెక్కలోకి రాకుండా ఎలా పోతుందన్నది విశ్లేషకుల మాట. ఒక వ్యక్తి ఫలానా పార్టీలో ఉండి ఒక సామాజిక వేదిక పై జారిపిత ను కించపరిస్తే అది మొత్తం పార్టీపైనే ప్రభావం చూపిస్తుందన్నది వారి వాదన. అయితే పవన్ నుండి ఇటువంటి అధికారిక ప్రకటన రాకమునుపే నాగబాబు కూడా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చాడు. గాడ్సే దేశభక్తుడు అన్నాను కాని గాంధీని తక్కువచేసి ఎక్కడా చెప్పలేదని చెప్పారు.

 

అయితే జనసేన పార్టీ వర్గాలకు నాగబాబు వ్యవహారం ఇబ్బందిగా మారింది అన్న విషయం మాత్రం వాస్తవం. అతనిని సమర్ధించాలా లేక వ్యతిరేకించాలో తెలియక పలువురు నేతలు సతమతమయ్యారు. మొత్తానికి ఎట్టకేలకు పవన్ ఇచ్చిన క్లారిటీ తో కొందరిలో మూతపడ్డాయనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: