కేరళ లో కరోనా మరణాల సంఖ్య 5కు చేరింది. ఈరోజు  కోజికోడ్ లో దుబాయి నుండి  వచ్చిన 53ఏళ్ళ మహిళ కరోనా తో మరణించింది. ఇక ఈరోజు కూడా కేరళ లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈఒక్క రోజే 52 కేసులు బయటపడ్డాయి. అందులో 19  విదేశాలనుండి వచ్చినవి కాగా 29 ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవి 5 కాంటాక్ట్ కేసులు. ఈ కొత్త కేసులతో కలిపి  కేరళ లో మొత్తం కేసుల సంఖ్య 847 కు చేరగా అందులో ఇప్పటివరకు 520మంది బాధితులు కోలుకున్నారు.  ప్రస్తుతం 322కేసులు యాక్టీవ్ గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఇక గత రెండు రోజుల నుండి దేశంలో రోజుకు 3500కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగనుంది. తమిళనాడు లో ఈరోజు 765 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 16227 కు చేరింది అలాగే ఢిల్లీ లో ఈరోజు కొత్తగా 508 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13418కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 66కేసులు నమోదవు కాగా మొత్తం కేసుల సంఖ్య 2627 కుచేరింది అందులో ఇప్పటివరకు 1807మంది బాధితులు కోలుకోగా  56మరణించారు. కాగా తెలంగాణ కు సంబందించిన హెల్త్ బులెటిన్ ఇంకా విడుదలకావాల్సి వుంది. 
 
ఓవరాల్ గా ఇప్పటివరకు దేశంలో 132000 కేసులు నమోదు కాగా 3800 మరణాలు సంభవించాయి. లాక్ డౌన్ 4 అమలులోకి వచ్చినప్పటి నుండి  చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది.  మరోవైపు ఈనెల 31తో  దేశ వ్యాప్తంగా విధించిన  లాక్ డౌన్ ముగియనుంది. ఆతరువాత మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తారా లేదా అనేది సస్పెన్స్ గానే  మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: