గ్యాస్ లక్షణం మండడమే కదా. ఇక రాజకీయ పార్టీల గ్యాస్ కి అసలు కొదవ ఉండదు. రెండూ కలిస్తే మండించే శక్తి  రెట్టింపు అవుతుంది. అదే ఇపుడు జరుగుతోంది. దాదాపు ఇరవై రోజులు అయింది విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగి. అక్కడ పరిస్థితులను సాధారణానికి తీసుకువచ్చి అంతా సరిచేసింది వైసీపీ సర్కార్.

 

కానీ టీడీపీకి రాజకీయం కావాలి. ఆ సంగతి వారి పోకడలు బట్టే తెలుస్తోంది. కోటి రూపాయలు నష్టపరిహారం జగన్ అక్కడికక్కడే ప్రకటించడమే కాదు, చాలా త్వరగా అందరికీ అందించే ఏర్పాట్లు చేశారు. బాధిత గ్రామల ప్రజలకు తాను తోడుగా ఉంటానని అన్నాడు. ఇక అక్కడ శాశ్వతమైన ఆసుపత్రి నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం మొదట బాధితులకు డిమాండ్  చేసింది కేవలం ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారమే.

 

కానీ జగన్ కోటి అనేసరికి మొదట ఏంచేయాలో పాలుపోలేదు. దాంతో కోటి రూపాయలు ఇస్తే ప్రాణాలు వస్తాయా అని రాజకీయ రాగాలు తమ్ముళ్ళు తీశారు. ఇపుడు  అక్కడ నుంచి స్టైరిన్ ని టన్నులకు టన్నులు దక్షిణ కొరియాకు  తరలించారు. పాలిమర్స్ కి తాళం వేశారు. రేపో మాపో పరిశ్రమను తరలిస్తామని వైసీపీ సర్కార్ పెద్దలు  అంటున్నారు. ఈ లోగా చంద్రబాబు అక్కడికి వచ్చి రాజకీయ రచ్చ చేయాలన్న‌ది తమ్ముళ్ళ ఆలోచన. అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

 

అందుకే పాత డిమాండ్లనే మళ్ళీ ముందుకు తెస్తూ గ్యాస్ మండిస్తున్నారు. బాధితులకు ఇచ్చిన నష్టపరిహారం చాలదని, ఇంకా ఇవ్వాలని టీడీపీ కోరుతోంది. మరి రేపు చంద్రబాబు కనుక పర్యటనకు వస్తే అక్కడ ఏమేమి డిమాండ్లు చేస్తారో, ఎలా చెడుగుడు ఆడతారో చూడాలి. ఏది ఏమైనా టీడీపీ రాజకీయం బాబు రాకతో విశాఖ పాలిమర్స్ గ్యాస్ మళ్ళీ   మండిపోతోంది. ఎలా ఆర్పుతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: