వైయస్ జగన్ పరిపాలన విషయంలో ప్రజలకు ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటున్నారు. మరోపక్క ఇదే సమయంలో ప్రత్యర్థులకు తనదైన శైలిలో చెక్ పెట్టుకుంటూ ప్రత్యర్థి గుండెల్లో నిద్రపోతున్నారు. ఏడాది పరిపాలనలో చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నరు జగన్. ఎక్కడా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కార మార్గం చూపెడుతూ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వడం లేదు. తనకి మరియు ప్రజలకు మధ్య ఎవరు లేకుండా గ్రామ వాలంటీర్లు, సచివాలయాల సిబ్బందితో ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఇంటికి చేరేలా పరిపాలన అందిస్తున్నారు.

 

దీంతో దేశవ్యాప్తంగా ఏపీ లో జరుగుతున్న పరిపాలన పై తల పండిపోయిన రాజకీయ నాయకులు హాట్ హాట్ చర్చలు జరుపుతున్నారు. జాతీయ స్థాయి మీడియా కూడా జగన్ పరిపాలన అందిస్తున్న సంక్షేమ పథకాలపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ టిడిపిలో చాలామంది నాయకులు జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ రావు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో జాయిన్ అయిపోయారు.

 

ఇటువంటి తరుణంలో త్వరలో వైజాగ్ నగరం లో కూడా టిడిపి పార్టీ నుండి భారీ ఎత్తున వైసీపీ పార్టీలోకి చేరికలు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ పట్టణంలో నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అయితే రాబోయే రోజుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. విశాఖపట్టణానికి త్వరలో రాజధాని తరలింపు వైయస్ జగన్ చేసే అవకాశం ఉండటంతో చాలా వరకు టిడిపి పార్టీ క్యాడర్ అంతా వైసీపీలోకి రావటానికి ఉత్సాహ పడుతున్నట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే విశాఖలో టీడీపీ పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందని ఏపీ రాజకీయాల్లో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: