చంద్రబాబు విశాఖ మధ్యన ఏదో పేచీ ఉన్నట్లుంది. అందుకే ఆయన రావాలనుకున్నా ఇన్నాళ్ళూ రాలేకపోయారు. చంద్రబాబు పార్టీ ఓడిన తరువాత గ‌త ఏడాది అక్టోబర్లో విశాఖ టూర్ చేపట్టారు. నాడు బాబు రెండు రోజుల పాటు జిల్లా మీటింగులు పెట్టారు. ఆ తరువాత బాబు మళ్ళీ అనుకున్నా రాలేకపోయారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు విశాఖకు వచ్చారు కానీ.

 

ఆయన్ని విశాఖ ఎయిర్ పోర్టులో ఆపేశారు. బాబు ఫిబ్రవరి 25న విశాఖకు వచ్చారు. అయితే ఆయన విశాఖ రాజధానికి వ్యతిరేకమని వైసీపీ శ్రేణులు ఆయన్ని గో బ్యాక్ అన్నాయి. ఏకంగా విశాఖ విమానాశ్రయంలో అడ్డుకుని రచ్చ రచ్చ చేశాయి. దాంతో బాబు దాదాపు ఎనిమిది గంటల పాటు విశాఖ ఎయిర్ పోర్టులో ఉండిపోయారు. ఇక బాబుని అటునుంచి అటు విశాఖ విమానాశ్రయంలో నుంచే హైదరాబాద్ కి పంపేశారు. 

 

ఆ తరువాత కరోనా మహమ్మారి రావడంతో బాబు ఈవైపు అసలు రావడంలేదు. అదే విధంగా ఆయన ఏపీ వైపు చూడకుండానే రెండు నెలలు గడిపారు. ఇపుడు విశాఖ ఎలీ పాలిమర్స్ ని పరామర్శించేందుకు బాబు విశాఖ టూర్ పెట్టుకున్నారు. ఈ మేరకు ఆయనకు ఏపీ డీజీపీ అనుమతి ఇచ్చారు.  దాంతో సరిగ్గా మళ్లీ అదే డేట్ అంటే 25వ తేదీన బాబు విశాఖ వస్తున్నారు.

 

బాబు టూర్ ఎలా సాగుతుంది. ఆయన ఏం చేయబోతారు, వైసీపీ మీద ఏ విధంగా రాజకీయ విమర్శలు చేస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. ఇక బాబు ఇక్కడ బాధిత కుటుంబాలను ఓదార్చడమే కాకుండా జగన్ సర్కార్ మీద నిప్పులు చెరుగుతారని అంటున్నారు. ఇక రాజధాని అంశాన్ని ఆయన ప్రస్తావించే అవకాశాలు లేవు కానీ విశాఖ బ్రాండ్ ఇమేజిని జగన్ సర్కార్ పాడుచేసిందని నిందలు వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి మూడు నెలల తరువాత బాబు విశాఖ రావడంతో పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: