టీడీపీ అధినేత చంద్రబాబుకు మళ్ళీ ఏపీ గుర్తొచ్చెంది. ఏపీ ప్రజలు కరోనాతో, లాక్ డౌన్ వల్ల నానా ఇబ్బందులు పడుతున్న సరే హైదరబాద్‌లో ఉండి కదలని బాబు... విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన జరిగిన రోజు ఏపీకి వెళ్ళేందుకు పర్మిషన్ కావాలని కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ ఆ రోజు మాత్రం బాబుకు పర్మిషన్ రాలేదు. ఇక ఇప్పుడు లాక్ డౌన్‌లో సడలింపులు రావడంతో తెలంగాణ, ఏపీ డీజీపీలని పర్మిషన్ అడిగారు.

 

అయితే తెలంగాణ డీజీపీ పర్మిషన్ వచ్చింది. కానీ వెంటనే ఏపీ నుంచి మాత్రం పర్మిషన్ రాలేదు. మళ్ళీ ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చారు. అయితే ముందు పర్మిషన్ ఇవ్వని సమయంలో, టీడీపీ నేతలు ఎందుకు పర్మిషన్ ఇవ్వారంటూ ఫైర్ అయిపోయారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ బాబుకు అదిరిపోయే సలహా ఒకటి ఇచ్చారు. ఎలాగో ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు జూమ్ యాప్‌లోనే నిర్వహించారు కాబట్టి, చంద్రబాబు పాలిమర్స్ బాధితులను జూమ్ యాప్ ద్వారా పరామర్శించవచ్చని చెప్పారు.

 

అలాగే చంద్రబాబు విశాఖ రావాలనుకుంటే ముందే వచ్చి క్వారంటైన్‌లో ఉండాల్సిందని చెప్పారు. అటు డీజీపీకి లేఖ రాసినట్లు ఆధారాలు చూపించాలని ఏపీ హోమ్ మంత్రి సూచరీత ప్రశ్నించారు. దీంతో హోమ్ మంత్రిపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. హోంమంత్రి సుచరిత డమ్మీ మాత్రమేనని, ఆ శాఖ రిమోట్‌ సజ్జల చేతిలో ఉందని, చంద్రబాబు ఏపీకి రావడానికి డీజీపీకి లేఖ రాస్తే రాయలేదంటూ హోంమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.

 

అయితే హోమ్ మంత్రిని డమ్మీ అనడంపై వైసీపీ శ్రేణులు కూడా రివర్స్‌లో కౌంటర్లు ఇస్తున్నారు. అసలు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అందరూ డమ్మీ మంత్రులే అని, ఓ సామాజిక వర్గం వారే ఆ మంత్రులని నడిపించారని విమర్శిస్తున్నారు. ఇక హోమ్ మంత్రిగా పనిచేసిన నిమ్మకాయల చినరాజప్ప అయితే పెద్ద డమ్మీ అని, ఆయన హోమ్ మంత్రి అని అప్పట్లో చాలామంది ప్రజలకు తెలియదని ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: