గతమెంతొ ఘనం...ప్రస్తుతం అథమం....ఇదే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత శతాబ్దంపై చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ మట్టిలో కలిసిపోయిన విషయం తెలిసిందే. అసలు వైఎస్సార్ మరణం, జగన్ కొత్త పార్టీ పెట్టడంతోనే ఆ పార్టీ పని అయిపోయింది. ఇక రాష్ట్ర విభజనతో ఒక్క శాతం ఓట్లు తెచ్చుకొని పార్టీ అయిపోయింది. అందుకే బడా నేతల దగ్గర నుంచి, ఛోటా మోటా నేతలు ఆ పార్టీని వదిలేసి వైసీపీ, టీడీపీల్లోకి వెళ్ళిపోయారు.

 

ఇక 2014, 2019 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేదు. అయితే డిపాజిట్లు దక్కకపోయినా సరే ఆ పార్టీని కొందరు నేతలు ఇంకా పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే 2018 తెలంగాణలో కలిసి పోటీ చేసిన తర్వాత నుంచి ఆ పార్టీకి చంద్రబాబు వెనుక సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.  అందుకే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు జగన్‌పై తెగ విరుచుకుపడుతున్నారు.

 

అసలు టీడీపీ కంటే ఎక్కువగా వారే ఫైర్ అయిపోతున్నారు. ముఖ్యంగా తులసిరెడ్డి లాంటి నేతలైతే చెప్పాల్సిన పని లేదు. జగన్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. తాజాగా కూడా తులసిరెడ్డి జగన్ ఏడాది పాలనపై విమర్శలు చేశారు. జగన్ వంద రోజుల పాలనకు నూటికి నూరు మైనస్ మార్కులు వస్తాయని, నవరత్నాల్లో నాణ్యత లోపించిందని వ్యాఖ్యానించారు. కొన్ని ఇప్పటికీ అమలుకు  నోచుకోకపోగా... గులకరాళ్లుగా మారాయని ఎద్దేవా చేశారు.

 

అయితే జగన్ పాలనకు మార్కులు ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీనే మైనస్‌లో ఉంది కదా...వారు కూడా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఎంతైనా బాబు డైరక్షన్‌లోనే వారు పనిచేస్తున్నారని అర్ధమవుతుందని, అయినా బాబు విమర్శలనే ప్రజలు పట్టించుకోవడం లేదని, ఇంకా కాంగ్రెస్ నేతలని పట్టించుకోవడం కష్టమని, కాబట్టి మైనస్‌గా ఉండే కాంగ్రెస్ నేతలకు జగన్ పాలనకు మార్కులు ఇచ్చే అర్హత లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: