ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు...తమిళనాడులో 23 ప్రదేశాల్లో ఉన్న శ్రీవారి భూములని వేలం వేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే దేవుడు భూములు వేలం వేయడంపై టీడీపీతో సహ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు...ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేస్తుందంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 50 రకాల ఆస్తులను అమ్మాలని గుర్తించారని చెప్పారు.

 

తన పాలనలో దేవుళ్ల  గుళ్లను కూల్చివేసిన నీచుడు చంద్రబాబు అని, టీటీడీ ఆస్తులు అమ్మితే జగన్ మోహన్ రెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావుకు ఒక్కరూపాయి కూడా రాదని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో విజయవాడ నిర్లక్ష్యానికి గురైందని, సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక నగర అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు.

 

అయితే బాబుని నీచుడు, టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ అభివృద్ధి జరగలేదనే కామెంట్లపై బెజవాడ తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. మంత్రి అయి ఉండి మాటలు ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదని తమ్ముళ్ళు అంటున్నారు. విమర్శలు చేయొచ్చు గానీ ఇలా హద్దులు దాటి చంద్రబాబు లాంటి వారిని అనడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. ఇక టీటీడీ భూములు అమ్మాలనే నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నామని, దేవుడు భూములు అమ్మడం పట్ల ప్రజలు కోపంతో ఉన్నారని, అది ప్రభుత్వానికే మైనస్ అవుతుందని అంటున్నారు.

 

ఇక గత ఐదేళ్లలో విజయవాడ అభివృద్ధి వెల్లంపల్లికి కనిపించలేదు అనుకుంటా, ఐదేళ్లలో ఊహించని అభివృద్ధి జరిగిందని గుర్తు చేస్తున్నారు. అందుకే విజయవాడ పరిధిలో ఉన్న ఎంపీ సీటు, తూర్పు సీటుని ప్రజలు టీడీపీకి కట్టబెట్టారని, అటు సెంట్రల్ సీటు కేవలం 25 ఓట్లతో కోల్పోయామని, వెల్లంపల్లికి వచ్చిన మెజారిటీ కూడా 7వేలే అని గుర్తు చేస్తున్నారు. అయితే అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి, విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీని ఓడించి చూడమని తమ్ముళ్ళు సవాల్ విసురుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: