చంద్రబాబు జిల్లా టూర్లు అంటేనే పసుపు పార్టీకి ఓ వైపు ఆనందం, మరో వైపు భయం కూడా కలుగుతోంది. ఎందుకంటే ఎక్కడ ఏ జిల్లాల్లో పార్టీ తమ్ముళ్ళు పేల్ట్ ఫిరాయిస్తున్నారో మీడియాకు ఇట్టే తెలిసిపోతోంది. వారు బాబుకు ముందస్తు సమాచారం ఇచ్చి రాకున్నా కూడా అది పెద్ద  రచ్చగా మారుతోంది. 

 

చంద్రబాబు ఫిబ్రవరిలో విశాఖ వచ్చి వైసీపీ శ్రేణుల నుంచి అతి పెద్ద నిరసనను ఎదుర్కొన్నారు. బాబును వైసీపీ నేతలు  గో బ్యాక్ అనేశారు. ఆ టైంలో విశాఖ జిల్లాలో కీలకమైన ఇద్దరు మాజీ మంత్రులు కనిపించలేదు. దాంతో మీడియాలో అది చిలవలు పలవలుగా వచ్చేసింది. గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు నాడు బాబు పక్కన కనిపించలేదు. వారు వేరే వ్యక్తిగత పనుల మీద రాలేదని పార్టీ వివరణ ఇచ్చినా కూడా అదే సెన్సేషనల్  న్యూస్ గా మారింది.

 

ఇపుడు నాటి నుంచి చూసుకున్నా కూడా గంటా పార్టీలో సౌండ్ చేయడంలేదు. ఆయన ఈ మధ్య విద్యుత్  చార్జీల పెంపు మీద ఇచ్చిన దీక్షల పిలుపునకు కూడా స్పందించలేదు. ఆయన నిజం చెప్పాలంటే ఓ విధంగా దూరంగానే ఉంటున్నారు. దాంతో చంద్రబాబు టూర్లో ఆయన కనిపిస్తారా అన్నది చర్చగా ఉంది. 

 

ఆయన వస్తే ఫరలేదు కానీ రాకపోతే మాత్రం బాబు విశాఖ టూర్ కంటే కూడా అది పెద్ద చర్చ అవుతుంది. అందులో వేరే డౌట్ కూడా లేదు. ఇక విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు జగన్ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో  బాధితులను బాగా ఆదుకున్నారంటూ మొదట్లో కితాబు ఇచ్చి పార్టీని ఇరుకున పడేసారు. అయితే ఆ తరువాత ఆయన సర్దుకున్నారు. ఆయన పేరు కూడా వైసీపీలోకి జంప్ చేసే వారి జాబితాలో ఉందంటారు. ఇక ఆయన సైతం గంటా ఎటు అంటే అటే అంటారని కూడా చెబుతారు.

 

కానీ ఇపుడు చంద్రబాబు టూర్ మొత్తం ఆయన పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆయన మీద ఎటువంటి డౌట్లు ఇపుడు పెట్టుకోవడంలేదు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్,  వెలగపూడి రామక్రిష్ణబాబు టీడీపీకి బద్దులైన వారు, దాంతో వారి విషయంలో ఎవరికీ సందేహలు  లేవు. దాంతో మొత్తానికి చూసుకుంటే విశాఖ జిల్లాలో అతి పెద్ద బిగ్ షాట్ గంటా మీదనే అందరి చూపూ ఉంది. మరి గంటా కనుక  బాబు వెంట ఉంటే మాత్రం ఇప్పటికి టీడీపీలో జంపింగులు లేవని చెప్పుకోవచ్చు.

 

అలాగే కొంతమంది నాయకులు కూడా పార్టీ పట్ల అసంత్రుప్తిగా ఉన్నారు. ఇక ఈ టూర్లో బాబు విశాఖ తమ్ముళ్లతో మీటింగు పెడతారు అంటున్నారు. ఆయన ఏం చేస్తారో చూడాలి. ఎవరు హాజరవుతారో కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: