గత కొన్ని రోజుల నుంచి నేపాల్ భారత్ తో  కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఏదోవిదాలుగా  విమర్శలు చేయడం... భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. మొన్నటి మన భారతదేశంలో పలు భాగాలు నేపాల్ దేశానికి చెందినవి అంటూ ఆరోపణలు చేసింది నేపాల్  ప్రభుత్వం. ఇదే సమయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు నేపాల్ ప్రధాని. అయితే భారత్లోని భూభాగాలు తమవే  అంటూ ఏకంగా  నేపాల్ అధికారిక మ్యాప్ కూడా విడుదల చేయడంతో భారత్ ముందుకు వచ్చి ఆ భూభాగాలు తమ దేశంలో ఉన్నది అంటూ పలు ఆధారాలు కూడా చూపెట్టి నేపాల్ నోరు ముగించింది. 

 


 ఇక ఆ తర్వాత ఏకంగా నేపాల్కు సంబంధించినటువంటి సైన్యం భారత సరిహద్దుల్లో కి భారీ మొత్తంలో మోహరించడం... ఆ తర్వాత ఏకంగా భారత సైన్యం కూడా రంగంలోకి దిగి అన్నింటికీ సిద్ధం అన్నట్లుగా వ్యవహరించడం ఇదంతా జరిగిపోయింది. ఇక ఇప్పుడు నేపాల్ సరికొత్త ఎత్తుగడ వేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం నేపాల్ సైన్యం భారత పోరాడితే ఒక్కరోజులోనే నేపాల్ సైన్యాన్ని మొత్తం మట్టుబెడుతుంది భారత సైన్యం. అదే సమయంలో వెనకుండి  నడిపిస్తున్న చైనా తెరమీదికి  వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రజలను అస్త్రాలుగా మార్చుకుంటుంది నేపాల్. 

 

 భారత్లో ఉన్న భూభాగాలు తమదేనంటూ ప్రజలకు చెప్పి కమ్యూనిస్టు నాయకులను భారత్-నేపాల్ సరిహద్దులో జెండాలు పాతి  నిరసనలు తెలిపేలా చాలా మందిని ప్రభావితం చేస్తుంది నేపాల్. ఇలాంటి కొత్త వ్యూహానికి తెరలేపారు  నేపాల్ ప్రధాని . అయితే ఇలా ఆందోళనలు నిరసనలు ఉద్యమాలు చేయించడం... ఇక భారత్ స్పందించి అక్కడ ఉద్యమాలు చేస్తున్న వారిని ఏదైనా ఉంటే.... ప్రజల పై దాడికి దిగారు అన్న కోణంలో నేపాల్ ప్రజలందరినీ ప్రభావితం చేసి  భారత్కు వ్యతిరేకంగా మార్చాలి అన్నది నేపాల్ వ్యూహం  అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో అటు భారత ప్రభుత్వం కూడా ఎంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: