తెలుగు రాజకీయాలలో చాణిక్యుడు అనే పేరు చంద్రబాబుకి ఎప్పటి నుండో ఉంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వ్యూహాలకు ఎంతటి తల పండిపోయిన రాజకీయ నాయకుడు అయిన సరే తల్లడిల్లి పోవాల్సిందే అని చాలామంది సీనియర్స్ అంటుంటారు. అటువంటి చంద్రబాబు పార్టీ టీడీపీ 2019 ఎన్నికల్లో ఏపీలో ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో జగన్ ప్రభుత్వం 151 అత్యధిక భారీ మెజార్టీ స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.  అయినా కానీ చంద్రబాబు తన చేతిలో ఉన్న కొద్ది మంది ప్రజాప్రతినిధులు తోనే జగన్ సర్కార్ ని ఇరుకున పెడుతున్నారు. ఒకపక్క వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మరోపక్క చంద్రబాబు తన చాణిక్య రాజకీయ ఎత్తుగడలతో తన చేతికి మట్టి అంటకుండా జగన్ పార్టీ ని డ్యామేజ్ చేస్తున్నారని చాలామంది అంటున్నారు.

 

అది ఎలా అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే రిజల్ట్ వచ్చిన తర్వాత తెలివిగా తన చేతిలో ఉన్న ఎంపీలను బాబు స్వయంగా బిజెపిలో చేర్పించడం అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఢిల్లీలో తన పట్టు నిలుపుకొని ఏపీలో బలమైన టిడిపి నాయకులను వైసీపీలో చంద్రబాబే వెనకనుండి జాయిన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఒక విధంగా చూసుకుంటే ప్రస్తుతం 151 ఎమ్మెల్యే ల గురించి కంటే ఎక్కువగా ఏపీ రాజకీయం టిడిపి నుండి వైసీపీ లోకి వెళ్లాలి అనుకుంటున్నా ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేల చుట్టే తిరిగింది.

 

అది కూడా చంద్రబాబు జాయిన్ చేసినట్లు కాకుండా వైసిపి పార్టీ మంత్రుల లాబీయింగ్ తో కానీ సలహాదారుల తో గాని జాయిన్ చేసినట్లు. దీంతో వైసిపి పార్టీలో ఆటోమేటిక్ గా ఎప్పటినుండో ఉన్న నాయకులకు అసంతృప్తి సెగలు పుట్టించారు. ఈ విధంగా ఒక పక్క తన పార్టీ ఎమ్మెల్యేలతో మరో పక్క వ్యవస్థలతో చంద్రబాబు తన రాజకీయ ఎత్తుగడలతో జగన్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారన్న అభిప్రాయం చాలామంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: