చంద్రబాబు విశాఖ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. సోమవారం ఉదయం నుంచి చంద్రబాబు విశాఖ పర్యటనకు సంబంధించి ఉత్కంఠ రేగుతూనే ఉంది. మేం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నా.. ఏపీ సర్కారు పర్మిషన్ ఇవ్వలేదని తెలుగుదేశం నేతలు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన హోం మంత్రి సుచరిత.. అసలు అప్లికేషన్‌ ఎవరిచ్చారు.. రుజువు చూపించండి అని మధ్యాహ్నమే సవాల్ విసిరారు.

 

ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ.. మొత్తానికి సాయంత్రానికి చంద్రబాబు విశాఖ టూర్ కు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చేశారు. దీంతో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు అయింది. కరోనా వైరస్ సమస్య వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లోనే మకాం చేసిన చంద్రబాబు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఏపీకి వెళ్తున్నారు. ఇంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నందున ఆయన ఇరు రాష్ట్రాల డిజిపిలకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ డిజిపి వెంటనే అనుమతి ఇవ్వగా, ఏపీ డిజిపి కాస్త ఆలస్యంగానైనా ఓకె చెప్పేశారు.

 

 

అలా కథ సుఖాంతం అయ్యిందనుకున్న సమయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేంటంటే.. ఏపీలో దేశీయ విమాన సర్వీసులు సోమవారం ప్రారంభం కావడం లేదు. మంగవారం నుంచి ప్రారంభం అవుతాయి. మరి విమానం ద్వారా విశాఖ వద్దామనుకున్న చంద్రబాబు కోరిక తీరనట్టే.. సో.. మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటన ఖరారైనట్టే అయ్యి మళ్లీ వాయిదా పడింది. పోనీ.. మంగళ, బుధవారాల్లో అయినా విశాఖ వెళ్తారా అంటే అదీ అనుమానమే.

 

 

ఎందుకంటే.. మహానాడు కు ముహూర్తం ముంచుకొస్తోంది. పోనీ మహానాడు తర్వాత వెళ్దామా అంటే.. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముందయితే ఏపీకి వస్తారు.. వచ్చాక ఏం చేయాలన్నది ఆలోచిస్తారేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: