ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు విమానాల ద్వారా ప్రయాణించే వారి కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. రేపటినుంచి రాష్ట్రంలో డొమెస్టిక్ విమానాల రాకపోకలు ప్రారంభం అవుతాయి. అయితే రేపటినుంచి విమానం ఎక్కాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మార్గదర్శకాలను పాటించకపోతే టికెట్ల బుకింగ్ కు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 
 
ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు స్పందన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్పందన వెబ్ సైట్ లో ప్రభుత్వం అనుమతులు ఇస్తే మాత్రమే ఎయిర్ లైన్స్ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వని వారికి టికెట్లను బుక్ చేసుకునే అవకాశం లేదు. ఏపీ ప్రభుత్వం స్పందన ద్వారా అనుమతులు లభిస్తే మాత్రమే టికెట్ల బుకింగ్ కు అనుమతించాలని తేల్చి చెప్పింది. 
 
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారి విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు లేని వారిని రెండు భాగాలుగా విభజిస్తామని తెలిపింది. చెన్నై, ముంబై, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారిని నేరుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించనుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి పరీక్షలు చేసి వారు 14 రోజులు హోం క్వారంటైన్ కు తరలించాల్సి ఉంది. 
 
కేంద్రం ఆదేశాల ప్రకారం ఈరోజు నుంచే ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకు రాకపోకలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ నిన్న రాత్రి 26వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని... 25వ తేదీన విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నామని కీలక ప్రకటన వెలువడింది. దీంతో రేపటి నుండి రాకపోకలు ప్రారంభం కానుండగా.... ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు ప్రకటించడంతో ప్రయాణికులు టెన్షన్ పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: