లాక్‌డౌన్ సమయంలో ఎందరో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి రాగా, అలా వచ్చినవారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారన్న విషయం తెలిసిందే.. ఆలా సీజ్ చేసిన వాహనాలను, ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ఇందులో కొన్ని వాహనాలకు జరిమానాలు విధించారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ సడలించడంతో ఆ వెహికల్స్‌ను తీసుకెళ్లేందుకు వాహనదారులకు అవకాశం కల్పించారు.

 

 

ఒక ఏపీలోనే కాదు ఇటు తెలంగాణలో కూడా సీజ్ చేసిన వాహనాలను తిరిగి తీసుకెళ్లాలని పోలీసులు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. అయితే తెలంగాణాలో నామమాత్రం రుసుం చెల్లించి వాహనాలను తీసుకోవలసి ఉంటుంది.. కానీ ఏపీలో ఇలా కాదు.. నిజంగా ఈ విషయంలో ఏపీ ప్రజలు అదృష్టవంతులని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వారు.. అదేమంటే ఏపీలో లాక్‌డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లేందుకు, వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి. ఆ సమయంలో తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను పీఎస్‌లో తప్పని సరిగ్గా సమర్పించాల్సి ఉంటుందట. ఇక ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఈ విషయంలో ఆదేశాలు జారీ చేశారట ఉన్నతాధికారులు.

 

 

అయితే ఈ సీజ్ అయిన వాహనాల విషయంలో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారట.. ఈ వాహనాలను తీసుకెళ్లే వాహనదారులు ఎలాంటి అపరాధ రుసుము చెల్లించకుండానే వారి వాహనాలను వారికి ఇచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి తప్పు మళ్లీ చేయకుండా వాహనదారుల నుంచి పూచికత్తును బాండ్‌ రూపంలో తీసుకుంటున్నారట. అంతే కాకుండా మోటార్‌ వెహికిల్‌ యాక్టు కింద సీజ్‌ చేసిన వాహనాలకు కూడా  నామమాత్రపు ఫైన్‌ విధించి ఎవరి వాహనాలను వారికి అప్పగిస్తున్నారట...

 

 

ఇక సీజ్ అయిన వాహనాలకు ఎన్ని డబ్బులు కట్టవలసి ఉంటుందో, ఎన్ని రోజులు కోర్టుల చుట్టు తిరగవలసి ఉంటుందో అని భయపడే వారికి నిజంగా ఇది శుభవార్తే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: