తెలుగు రాష్ట్రాలలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే.. మరోవైపు కర్నాటక రాజధాని బెంగళూరులో మండు వేసవిలో భారీ వర్షం పడింది. ఒక్కసారిగా నగరంలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోవడం జరిగింది.  ఆదివారం నాడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నగరంలో పడింది. ఇక నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురవడంతో చాలా రోడ్లు జలమయమై, డ్రైనేజీ కూడా పొంగి పొర్లింది. 

 

IHG

ఇంకా మరి కొన్ని ప్రాంతాలలో అయితే రోడ్ల మీదే చెట్లు విరుచుకుపడడంతో వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బంది ఎదురయ్యింది. ఇక నగరంలోని లోతట్టు ప్రాంతాలు కూడా వర్షం నీటితో నిలిచి పోవడం జరిగింది. అలాగే నగరంలోని కొన్ని ప్రాంతాలలో డ్రైనేజ్ నిండిపోయి మురికి నీరు అంతా కూడా రోడ్డుమీదికి రావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు నగరంలోని అనేక ప్రాంతాలలో వేగంగా వీచిన ఈదురు గాలులకు చెట్లు కూడా కూలిపోయాయి. 

IHG

 

ఇక ఇది ఇలా ఉండగా మరోవైపు భారత వాతావరణ శాఖ మే 30 వరకు బెంగళూరులో వర్షాలు పడుతాయని తెలియజేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలుగు రాష్ట్రాలలో ఎదలు బగబగ మంటుంటే పక్కనే ఉన్న కర్ణాటక లో మాత్రం పరిస్థితి విడ్డురంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: