రోజురోజుకి తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ వెళుతుంది. నేడు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 2671 గా నమోదయ్యాయి. ఇక ఇందులో  1848 మంది డిశ్చార్జ్ అవ్వగా, రాష్ట్రం మొత్తం మీద 56 మంది  మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసులు 767.

 


అయితే ఇందులో వివిధ దేశాలనుంచి వచ్చిన కేసులు 62 గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న ఒక్క రోజే 45 కొత్త కేసులను రాష్ట్రం గుర్తించింది. అందులో 41 కేసులు కువైట్ దేశం నుంచి వచ్చినవి, మూడు కేసులు కత్తార్ నుంచి, మరో కేసు సౌదీ అరేబియా దేశం నుంచి వచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది.


అయితే ఇప్పటి వరకు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 153 కేసులు పాజిటివ్ గా గుర్తించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఇక అందులో ఒరిస్సా నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి 101, గుజరాత్ నుంచి 26, కర్ణాటక నుంచి 1, వెస్ట్ బెంగాల్ నుంచి 1, రాజస్థాన్ నుంచి 11, తమిళనాడు నుంచి 3 కేసులు ఇలా మొత్తం 117 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపారు.

 

రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,240 సాంపిల్స్ ని పరీక్షించగా అందులో 44 మంది కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. ఇక 41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: