ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో అనేక మంది వలస కూలీలు, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ విదితమే. నేడు ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ పండుగ ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు. మామూలుగా ఈ పండుగను ముస్లింలు ఎన్ని కష్టాలు ఉన్న సంతోషంగా పండుగను జరుపుకొనే ప్రయత్నం చేస్తారు. అయితే ఈసారి మాత్రం ఈ పరిస్థితి చాలా విరుద్ధంగా ఉంది అది కూడా కేవలం కరోనా వైరస్ పుణ్యమే. 


అయితే ఇక అసలు విషయం కొస్తే... సింగపూర్ దేశంలో సుమారు 600 మంది వలస కార్మికులకు ఆదివారం నాడు నిజంగా ఈద్ పండుగ జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా దుష్యంత్ కుమార్ ఆర్ అనే బిజినెస్ మ్యాన్ తన భార్యతో, మరికొంతమంది వంటివారితో కలిసి బ్రహ్మాండమైన బిర్యానీ విందును ఏర్పాటు చేశారు వారికోసం. ఇకపోతే వారందరూ లాక్ డౌన్ నేపథ్యంలో వారి వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.అయితే పండుగ నాడు ఎలాంటి విందుకు నోచుకోలేకపోతున్న వాళ్ళు చాలా బాధ పడుతున్న సమయంలో వారి ముఖాల్లో కనీసం ఒక్కరోజు అయిన చిరునవ్వు కోసం ఆయన ఈ ఏర్పాటు చేశాం అని తెలియజేశారు.


ఇకపోతే ఆయన ఏప్రిల్ నెల నుంచే రోజుకు సుమారు వెయ్యి ఆహార ప్యాకెట్లను పంచుతూ వస్తున్నాడట. ఆ దేశంలో నిజానికి మూడు లక్షల మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. అందులో ఎక్కువగా భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, థాయిలాండ్ వంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో అక్కడికి వలస వచ్చారు. నిజానికి ఇందులో చాలా మందికి నివాసం ఉండటానికి ఇల్లు లేవు. అయితే అక్కడి ప్రభుత్వం, ఇంకా ప్రభుత్వేతర సంస్థలు ఏర్పాటు చేసిన చిన్న చిన్న గదుల్లో వారు జీవనం కొనసాగిస్తున్నారు. అదికూడా ఒక చిన్న గదిలో 20 నుంచి 25 మంది వరకు ఉంటూ కాలాన్ని నరకప్రాయంగా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం సింగపూర్ లో 30వేల కేసులకు పైగా నమోదు అవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: