కొందరు వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వారి కోసం ఏదైనా మంచి చెబితే అసలు పట్టించుకునే విధంగా కూడా ఉండరు. అయితే ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో జరిగింది. క్వారంటైన్ సెంటర్లో ఉండు అన్నందుకు వారిపై మూకుమ్మడిగా దాడిచేసి ఇద్దరిని హతమార్చారు. ఇక ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళితే....

 

మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ జిల్లా బోలే గౌన్ ప్రాంతానికి చెందిన విద్య మన్ బరందే అనే వ్యక్తి స్వతహాగా లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఆయన గుజరాత్ రాష్ట్రం నుండి మహారాష్ట్రలోని తన గ్రామానికి తిరిగి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో అదే గ్రామంలో ఉంటున్న షాహీజీ పాటిల్ అనే వ్యక్తి విద్య మన్ బరందే ను క్వారంటైన్ సెంటర్ లో ఉండాలని సూచించాడు. ఈ విషయానికి విద్య మన్ బరందే ససేమిరా అని తెగేసి చెప్పాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది.


ఇక ఇదే నేపథ్యంలో కోపం తెచ్చుకున్న విద్య మన్ బరందే తన ఊరి పక్కనే ఉన్న సోదరి గ్రామంకు వెళ్ళాడు. అయితే అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ ఊరిలో ఉండే కొంతమందిని వెంట తీసుకొని బోలెగావున్ కు వారిని తీసుకు వెళ్ళాడు. ఇక ఆ తర్వాత పటేల్ ఎక్కడ ఉన్నాడు కనుక్కొని అక్కడికి వెళ్లి అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ సమయంలో పాటిల్ తో పాటు అతని బంధువు వైపు కూడా అక్కడే ఉండగా అతని పై కూడా వారు దాడి చేశారు. ఇక వారు కొట్టిన దెబ్బలకు ఇద్దరు కోలుకోలేక అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం అందులోని ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: