తిరుమల తిరుపతి దేవస్థానానికి  ఏ మాత్రం ఉపయోగపడని కొన్ని ఆస్తులను వేలం విక్రయించడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దేవస్థానానికి ఏ మాత్రం ఉపయోగపడని ఆస్తులను అమ్ముతున్నట్లు టీటీడీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ఇటీవల తెలిపారు. అయితే ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ కొన్ని మీడియా ఛానల్స్ మరియు పార్టీలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నట్లు సీరియస్ అయ్యారు. అన్ని నిబంధనలను రూల్స్ ను పాటిస్తూ వాస్తవాలను బయటపెట్టారు. ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కొన్ని వివరాలను తెలియజేశారు.

 

 జీవో ఎంఎస్ నెంబర్ 311 రెవెన్యూ ఎండార్స్మెంట్ 1, 941990 రూల్ 165 చాప్టర్ 22 ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి మేలు కలిగే అవకాశం ఉంటే ఆస్తులను విక్రయించడం లీజుకివ్వడం వంటి అధికారాలు టీటీడీ బోర్డుకి అధికారాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా బోర్డు నిర్ణయానికి మరియు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఇటువంటి ప్రక్రియ 1974 నుంచి జరుగుతుందని తెలిపారు. ఈ విధంగా 2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించినట్లు తెలిపారు.

 

 ఇటువంటి సమయంలో దేవస్థానానికి ఏ మాత్రం ఉపయోగపడని ఆస్తులను అమ్మాలని నిబంధనలు రూల్స్ చెబుతుంటే వీటిని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఇది దేవస్థానానికి ఎంతో మంచి చేసే నిర్ణయమని దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం అమానుషమని విపక్షాలపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇలాంటి తెగింపు నిర్ణయాలు తీసుకునే జగన్ మీద ఎందుకు అంత ఏడుపు అంటూ వైసీపీ నాయకులు ప్రతిపక్షాల పై సెటైర్లు వేస్తున్నారు. దేవస్థానానికి ఎంతో మంచి చేసే ఈ నిర్ణయం పై ప్రతిపక్షాలకు ఇంత ఏడుపు ఉండకూడదని దేవుడు శాపం తగులుతుందని మళ్లీ కోలుకోలేని దెబ్బ తగులుతుందని హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: