దాదాపు 50 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నాడు చంద్రబాబు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో చంద్రబాబు హైదరాబాదులో ఇంటికి పరిమితం అయిన విషయం అందరికి తెలిసిందే. ఇంటి దగ్గర నుండి రాష్ట్రంలో సమస్యలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ మొన్నటి దాక వచ్చారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు తొలగిస్తూ సడలింపులు ఇవ్వటంతో చంద్రబాబు ఏపీ కి రావటానికి రెడీ అయ్యారు. ఈ సమయములో APలో విమాన రాకపోకలకు అనుమతి లేకపోవడంతో చంద్రబాబు విశాఖపట్టణం ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించాల్సిన టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు.

 

అయినా కానీ హైదరాబాదు నుండి నేరుగా అమరావతికి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు రాబోతున్నారు. దాదాపు అధ్యక్షుడు రెండు నెలలకు పైగా అందుబాటులో లేని ఈ నేపథ్యంలో తాజాగా వస్తున్న గాని టిడిపి పార్టీలో ఇదివరకు ఉన్న ఉత్సాహం, ఊపు ఏమాత్రం కనిపించడం లేదు. ఇదే సమయంలో టిడిపి పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా రెడీ అవ్వుతుంది. కరోనా వైరస్ కారణంగా జనాలు గుంపులుగుంపులుగా సమావేశమయ్యే అవకాశం లేకపోవడంతో జూమ్ యాప్‌ ద్వారా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (మహానాడు) నిర్వహించబోతోంది.

 

దీనికోసం భారీస్థాయిలో ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయినాగానీ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఎక్కడా కనబడటం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు లో కూడా మునుపటి సీరియస్‌నెస్‌ కొరవడిందన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. గతంలో మాదిరిగా చంద్రబాబు ప్రస్తుతం వ్యవహరించడం లేదని పార్టీలో బలమైన టాక్ వినబడుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత రాష్ట్రంలో అడుగుపెడుతున్న చంద్రబాబు కనీసం తనతో పాటు నారా లోకేష్ నీ కూడా వెంటబెట్టుకుని తీసుకు వచ్చిన పరిస్థితి కనబడటం లేదని నిరుత్సాహం ఎక్కువైందని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: