తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఉన్న టైంలో గాని ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా రాజకీయాలు చేసేవాడు. కేసిఆర్ ని, టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డి ఇటీవల చాలా సైలెంట్ అయిపోయారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా యాక్టివ్ గా కనబడటం లేదు. ప్రతిపక్ష పార్టీ అంటే ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తూ ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించాలి. కానీ అటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చూపించలేక పోతుందని విమర్శలు వస్తున్నాయి.

 

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కొన్నాళ్లుగా గతంలో మాదిరిగా కాకుండా చాలా వరకు చల్లబడి పోయారు. ప్రజా సమస్యలపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై గతంలో మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం లేదన్న టాక్ బలంగా వినబడుతోంది. ప్రస్తుత కరోనా వైరస్ కష్టకాలంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేదని, అసలు రేవంత్ రెడ్డి కి ఇంత టైమింగ్ ఉన్నాగాని ఎందుకు నోరు మెదపడం లేదని తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

 

రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరియర్ లో సడన్ గా ఇటువంటి నిశ్శబ్దం దాపురించడని చాలామంది రకరకాలుగా చర్చించుకుంటున్నారు. పార్టీ తరఫున ఎంత పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి పైకి రాకుండా అడ్డుకుంటున్నారు అన్న టాక్ వినపడుతోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా గతంలో ప్రభుత్వంపై పోరాటం చేసిన సమయంలో జైల్లోకి వెళ్లిన టైములో పార్టీ నుండి తనకు సపోర్ట్ రాకపోవడంతో ఇక సైలెంట్ అయిపోయినట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: