ఈ మధ్యకాలంలో టిక్టాక్ జనాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ టిక్టాక్లో కాలం గడుపుతున్నారు. గంటల కొద్దీ టిక్టాక్లో కాలం గడుపుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. అయితే ఈ టిక్  టాక్  ఎంటర్టైన్మెంట్ అందించడం వరకు ఓకే కానీ టిక్టాక్ కారణంగా ఎన్నో అనర్థాలు కూడా జరుగుతున్నాయి. టిక్ టాక్ లో లైక్ ల కోసం కొంతమంది విచిత్ర స్టెంట్స్   చేస్తు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు మరికొంతమంది విచిత్రమైన పనులు చేసి  జైలు పాలవుతున్నారు . అంతేకాకుండా ఈ టిక్టాక్ ఎంతోమంది కాపురాల్లో కూడా చిచ్చు పెట్టి  భార్యాభర్తలను విడగొడుతుంది . 

 


 తాజాగా  టిక్ టాక్ ఒక కానిస్టేబుల్ ని బుక్ చేసింది. స్నేహితురాలి  టిక్టాక్ పిచ్చి కారణంగా ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ బుక్కయ్యాడు. సదరు కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుని అతని స్నేహితురాలు వీడియోలు చేయడంతో అతనిపై దర్యాప్తు చేయాలంటూ అధికారులు ఆదేశించారు. ఈ ఆసక్తికర ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన విజయ్ బ్రాహ్మణి అనే వ్యక్తి సమీప పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ లో పని చేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం స్నేహితురాలు  అతడి పోలీసులు డ్రెస్ వేసుకుని టిక్ టాక్ వీడియోలు చేసింది. ఇక టిక్ టాక్ లో ఆ వీడియోలు కాస్త తెగ  వైరల్ అయిపోయింది. 

 

 ఎంతలా  వైరల్ అయిపోయాయి అంటే ఏకంగా టిక్ టాక్ వీడియోలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లేంతలా వైరల్ అయిపోయాయి. అయితే ఆ టిక్ టాక్ వీడియోలో  ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేకపోయినప్పటికీ... యువతి ఎంటర్టైన్మెంట్ కోసం బాధ్యతగల పోలీస్ డ్రెస్ వేసుకున్నందుకు  ఎస్పీ శివాజీ రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో సదరు కానిస్టేబుల్పై దర్యాప్తుకు ఆదేశించారు ఎస్ పి శివాజీ రాథోడ్ . ఈ కేసులో విచారణ పూర్తయిన అనంతరం కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనిల్ దేశ్ ముఖ్  ప్రకటించిన నాలుగు రోజులకే ఇలాంటి పోలీస్ డ్రెస్  ఘటన జరగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: