2019 ఎలక్షన్ లో ఏపీ ప్రజల తీర్పు దెబ్బకి తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ఆల్ దుకాణం సర్దుకునే పరిస్థితికి దిగజారిపోయింది అనే టాక్ ఇప్పటికే నడుస్తోంది. తెలంగాణలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఏపీ లో కూడా కొన ఊపిరితో తన ఉనికిని ప్రస్తుతం చాటుకుంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ ఓ వెలుగు వెలగాలి అంటే ఖచ్చితంగా పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అని టీడీపీ కేడర్ అంటుంది. గతంలో తన తండ్రి హరికృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి 2009 ఎన్నికల టైంలో ప్రచారం నిర్వహించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వకపోవడం తో సైలెంట్ గా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

 

అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి మరియు హరికృష్ణ కి సపోర్ట్ చేసిన పార్టీ లో నాయకులను చంద్రబాబు సైలెంట్ గా పక్కన పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇటువంటి సమయంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి చివరి దశకు వచ్చేసింది అన్న వార్తలు వస్తున్న తరుణంలో..  చాలావరకు పార్టీ కి పూర్వ వైభవం రావాలంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకురావాలని చాలా మంది సీనియర్ నాయకులు అంటున్నారు. పార్టీ లో ఎప్పటినుండో ఉంటున్న టీడీపీ సీనియర్ క్యాడర్ నాయకులూ పార్టీ బలపడాలంటే ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకురావలసిందే అని అంటున్నారు. గత ఎన్నికల టైం లో బాబు మరియు బాలయ్య బాబు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదు అని కామెంట్ చేసిన వారు అడ్రస్ లేకుండా చిత్తుగా ఓడిపోయారు.

 

ఇటువంటి పరిణామంలో పార్టీ క్యాడర్ త్వరలో జరగబోయే మహానాడులో జూనియర్ ఎన్టీఆర్ కి ఒక పదవి ప్రకటించాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినబడుతోంది. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపై ఉందని తనకు రాజకీయాలు గాని కులాలు గాని ఆపాదించే ప్రయత్నం చేయవద్దని మొత్తుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: