ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ఓ ఊపు ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌.. పేద.. ధనిక, చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా పెద్ద సంస్థల నుంచి చిరు వ్యాపారుల వరకూ అందరూ ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇక కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయిన వారి జాబితాలో సెక్స్ వర్కర్లు ముందుంటారు. అటు వ‌ల‌స కూలీలు ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నారో.. అంతే స్థాయిలో సెక్స్ వ‌ర్క‌ర్లు బాధ‌లు అనుభ‌విస్తున్నారు. ముఖ్యంగా కొందరు సెక్స్ వర్కర్ల జీవితం మరీ దుర్భరంగా మారింది. 

 

రెండునెలల నుంచి పనిలేకపోవడం.. మరోవైపు క‌నీసం రేషన్ కార్డు లేకపోవడం వారి పట్ల శాపంగా మారింది. దీంతో తమకు ఆకలితో చావే శరణ్యమంటున్నారు. అందుకే కరోనాని ఎదురించి వ్యాపారం మొదలుపెట్టారు. కానీ.. తమ గడప తొక్కే కష్టమర్లే కరువయ్యారు. సాధారణంగా సెక్స్ వర్కర్ల వ‌ద్ద‌కు నిత్యం కస్టమర్లు వచ్చి పోతుంటారు. అలా వచ్చిన వారి ద్వారా సెక్స్ వర్కర్లకు కరోనా సోకే ముప్పు ఎక్కువ. దీంతో సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే కష్టమర్లను ఆకట్టుకునేందుకు వాళ్లు అనేక ప్ర‌య‌త్నాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్ర‌మంలోనే సెక్స్ వర్కర్లు డిజిటిల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అంటే ఫోన్ లో వీడియో కాల్స్ చేసి.. వారిని సంతృప్తి పరుస్తార‌న్న‌మాట‌.

 

విన‌డానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. దీంతో ఇప్పుడు ఫోన్ రొమాన్స్ అనేది.. వారి దినచర్యలో భాగంగా మారింది. ఫోన్ కాల్ అయితే ఒక రేటు.. వీడియో చాట్‌ అయితే ఒక రేటు ఛార్జ్ చేస్తున్నార‌ట‌.  రెండూ 30 నిమిషాల వరకు ఉంటాయి. ఇక కస్టమర్లతో ధర మాట్లాడుకున్న తర్వాత నగదును గూగుల్ పే ద్వారా చెల్లించాల్సిందిగా సూచిస్తున్నార‌ట‌. మ‌రియు సాధారణ ఫోన్ కాల్‌కు రూ. 300, వీడియో చాట్ కోసం రూ. 500 వసూలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, వారి ముఖాన్ని ఎవరూ రికార్డ్ చేయకుండా ఉండేందుకు  దుపట్టాతో కప్పేసుకుంటార‌ట‌. కాగా, ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా చాలా మంది సెక్స్ వర్కర్లు ఫోన్‌లో ఇలాంటి సేవలను అందిస్తున్నారని తెలుస్తోంది.
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: