వరంగల్ జిల్లాలోని గొర్రెగుంట బావిలో 9 మంది హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈరోజు వరంగల్ సీపీ నిందితుడు సంజయ్ ను మీడియా ముందు ప్రవేశపెట్టాడు. ఈ నెల 21వ తేదీన గోనెసంచుల కంపెనీ ఓనర్ ఫిర్యాదు చేశాడని 21వ తేదీన మక్సూద్, భార్య, కూతురు, మనవడు శవాలు దొరికాయని మరుసటి రోజు 5 శవాలు దొరికాయని తెలిపారు. 
 
ఆరు బృందాలు ఈ కేసు కోసం ఏర్పాటు చేశామని అన్నారు. మక్సూద్ కుటుంబంలో మొత్తం ఆరుగురు ఉన్నారని...వారికి సంజయ్ కుమార్ అనే వ్యక్తి 5 సంవత్సరాల క్రితం పరిచయం ఉందని తెలిపారు. మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫీకాతో సంజయ్ కు ఏర్పడిందని తెలిపారు. ఆమె పశ్చిమ బెంగాల నుంచి ముగ్గురు పిల్లలను తీసుకొని వరంగల్ కు రావడం జరిగిందని ఆమె మక్సూద్ సహాయంతో గోనె సంచుల ఫ్యాక్టరీతో ఏర్పడిందని తెలిపారు. 
 
రఫీకా సంజయ్ కు భోజనం వండిపెట్టి డబ్బులు తీసుకునేదని... ఇద్దరికీ ఆ తరువాత వివాహేతర సంబంధం ఏర్పడిందని... వారు ఒక గది తీసుకుని సహజీవనం సాగించారని సమాచారం. రఫీకా పెద్ద కూతురుతో సంజయ్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో రఫీకా సంజయ్ మధ్య గొడవ జరిగింది. అనంతరం సంజయ్ రఫీకాను తీసుకుని గరీభ్ రథ్ ఎక్సె ప్రెస్ లో మజ్జిగలో నిద్రమాత్రలు నిద్రమాత్రలు ఇచ్చి... చున్నీతో మెడకు బిగించి రైలు నుంచి తోసేశాడని తెలిపారు. 
 
నిడదవోలు ప్రాంతంలో రఫీకా శవం గురించి ఎఫ్.ఐ.ఆర్ మొదలైందని మక్సూద్ భార్య నిషా రఫీకా గురించి అడగగా పొంతన లేని సమాధానాలు చెప్పాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పడంతో సంజయ్ వారిని హత్య చేయడానికి ప్లాన్ చేశాడని తెలిపారు. నిద్రమాత్రలు కొనుగోలు చేసి 20వ తేదీ మక్సూద్ భోజనంలో నిద్రమాత్రలు కలిపాడని... బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరి ఇంట్లో కూడా నిద్రమాత్రలు కలిపాడని అనంతరం వారిని గోనెసంచుల్లో వేసి బావిలో పడేసి హత్య చేశాడని సీపీ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: